Bird Flu: బర్డ్‌ఫ్లూ సోకిన 10వేల కోళ్లను చంపేశారు
ABN, Publish Date - Apr 04 , 2025 | 05:28 AM
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాటసింగారం గ్రామ పరిధిలోని ఓ పౌల్ర్టీ ఫామ్‌లో బర్డ్‌ఫ్లూ సోకిన 10 వేల కోళ్లను గురువారం జిల్లా పశువైద్య, పశుసంవర్ధక శాఖ అధికారుల బృందం చంపేసింది.

రంగారెడ్డి జిల్లా బాటసింగారంలో వైద్యాధికార్ల చర్య
అబ్దుల్లాపూర్‌మెట్, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాటసింగారం గ్రామ పరిధిలోని ఓ పౌల్ర్టీ ఫామ్‌లో బర్డ్‌ఫ్లూ సోకిన 10 వేల కోళ్లను గురువారం జిల్లా పశువైద్య, పశుసంవర్ధక శాఖ అధికారుల బృందం చంపేసింది. అనంతరం వాటిని సంచుల్లో వేసి లోతుగా తవ్విన గుంతలో పాతిపెట్టారు. సదరు ఫామ్‌లో సుమారు 36 వేల కోళ్లు ఉండగా ఇప్పటికే కొన్ని బర్డ్‌ఫ్లూతో చనిపోయాయి. మిగిలిన 17,500 కోళ్లలో గురువారం 10వేల కోళ్లను అధికారులు చంపేశారు. మిగిలిన వాటిని శుక్రవారం చంపేసి పాతిపెట్టనున్నట్లు తెలిపారు. ఈ ఫామ్‌కు సమీపంలోని ఫామ్‌లలో కోళ్ల శాంపిల్స్ సేకరించనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ బాబుబేరీ మాట్లాడుతూ... సమీపంలోని పౌల్ర్టీఫామ్ నిర్వాహకులు జాగ్రత్తలు పాటించాలని, ప్రతి రోజూ ఫామ్ చుట్టూ శానిటైజేషన్ చేయాలని సూచించారు. కోళ్లు మృత్యువాత పడితే వెంటనే తమకు సమాచారమివ్వాలన్నారు.
ఏపీలో ఆ కోళ్లు బర్డ్‌ఫ్లూతోనే చనిపోయాయి: కేంద్రం
అమరావతి, (ఆంధ్రజ్యోతి): ఏపీలోని కాకినాడ జిల్లా చెందుర్తి, పిఠాపురం ఫారాల్లోని కోళ్లు బర్డ్‌ఫ్లూ వైరస్ వల్లే చనిపోయినట్లు నిర్ధారణ అయింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీకి అధికారిక సమాచారం వచ్చింది. ఇదే విషయాన్ని కేంద్రం గెజిట్‌లో ప్రచురించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
స్వల్పంగా తగ్గిన గోల్డ్, వెండి ధరలు..
For More AP News and Telugu News
Updated Date - Apr 04 , 2025 | 05:28 AM