Siddipet: సిద్దిపేటలో బర్డ్‌ఫ్లూ కలకలం
ABN , Publish Date - Apr 09 , 2025 | 04:10 AM
సిద్దిపేట జిల్లా తొగుట మండలం కాన్గల్‌లోని పౌలీ్ట్ర లేయర్ ఫామ్‌లో బర్డ్‌ఫ్లూ కలకలం రేగింది. కొన్నాళ్లుగా కోళ్లు మృత్యువాత పడుతుండటంపై ఫామ్‌హౌస్ నిర్వాహకులు ఈనెల 3న హైదరబాద్‌లోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

తొగుట మండలం కాన్గల్ లేయర్ ఫామ్‌లో కోళ్లకు వ్యాధి నిర్ధారణ
వారంలో 1.45 లక్షల కోళ్లను చంపి పూడ్చనున్న సిబ్బంది
నిర్వాహకులకు భువనగిరిలోనూ ఫామ్.. అక్కడ 3 కోళ్లు మృతి
అక్కడి కోళ్లకూ సోకి ఉంటుందా? ఆరా తీస్తున్న అధికారులు
సిద్దిపేట టౌన్, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): సిద్దిపేట జిల్లా తొగుట మండలం కాన్గల్‌లోని పౌలీ్ట్ర లేయర్ ఫామ్‌లో బర్డ్‌ఫ్లూ కలకలం రేగింది. కొన్నాళ్లుగా కోళ్లు మృత్యువాత పడుతుండటంపై ఫామ్‌హౌస్ నిర్వాహకులు ఈనెల 3న హైదరబాద్‌లోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఆ శాఖ అధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు సిద్దిపేట జిల్లా అధికారులు ఈనెల 4న శాంపిల్స్ సేకరించి మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఉన్న ల్యాబ్‌కు పంపారు. మంగళవారం వచ్చిన రిపోర్టులో బర్డ్ ఫ్లూ పాజిటివ్ అని తేలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
దాదాపు 20 బృందాలను ఏర్పాటు చేసిన అధికారులు, బుధవారం నుంచి లేయర్ ఫామ్‌లోని షెడ్లలో ఉన్న 1.45 లక్షల కోళ్లను చంపి పూడ్చిపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ ప్రక్రియ వారం పాటు జరగనున్నట్లు తెలిసింది. పౌలీ్ట్ర ఫామ్ నిర్వాహకులకు భువనగిరిలోనూ పౌలీ్ట్ర ఫామ్ ఉండటం.. అక్కడ మూడు కోళ్లు చనిపోవడంతో అక్కడి కోళ్లకూ బర్డ్‌ఫ్లూ సోకి ఉంటుందా? అని అధికారులు ఆరా తీస్తున్నారు.