Bird Flu: బర్డ్ ఫ్లూపై రంగంలోకి కేంద్రం
ABN , Publish Date - Apr 05 , 2025 | 05:21 AM
కోళ్ల కోసం తీసుకొచ్చిన 5 టన్నుల దాణాతోపాటు, బర్డ్ ఫ్లూ సోకిన కోళ్లు పెట్టిన 14 వేల గుడ్లను సైతం వారు పగలగొట్టి అదే గోతిలో పారబోసి పూడ్చేశారు. ఫామ్ చుట్టూ సున్నం చల్లి శానిటైజ్ చేశారు. ఫామ్‌లోని ఐరన్ జాలీలను మంటతో శుద్ధి (ఫ్యూమిగేషన్) చేశారు.

జీవభద్రత నిబంధనలు కఠినతరం
అబ్దుల్లాపూర్‌మెట్, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ, ఛత్తీ్‌సగఢ్, ఝార్ఖండ్ సహా దేశవ్యాప్తంగా ఆరు జోన్లలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో.. జీవభద్రత నిబంధనలను కేంద్రం కఠినతరం చేసింది. శుభ్రతను పాటించాలని, పౌలీ్ట్ర ఫారాల్లోకి ఎవరు పడితే వారు ప్రవేశించకుండా చూసుకోవాలని, నెలరోజుల్లోగా సంబంధిత అధికారుల వద్ద తప్పనిసరిగా పౌలీ్ట్ర ఫారాల వివరాలు నమోదుచేసుకోవాలని పౌలీ్ట్ర యజమానులకు సూచించింది. దీనిపై కేంద్ర పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అల్కా ఉపాధ్యాయ శుక్రవారం అత్యున్నతస్థాయి సమావేశం నిర్వహించి, ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. మన ఆహార భద్రతను, గ్రామీణ ప్రాంతాల జీవనోపాధికి.. పౌలీ్ట్ర రంగాన్ని కాపాడుకోవడం కీలకమని ఆమె పేర్కొన్నారు. ‘‘ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా వైరస్ ఈసారి ఒక జాతీ జీవాల నుంచి మరో జాతి జీవాలకు కూడా సోకుతోంది.
కోళ్లకే పరిమితం కాక.. అడవి పక్షలకు, కొన్ని ప్రాంతాల్లో పిల్లిజాతి జీవాలకు కూడా సోకుతోంది’’ అని సీనియర్ అధికారి ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాటసింగారంలోని ఓ పౌలీ్ట్రఫామ్‌లో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకిన నేపథ్యంలో గురువారం 10 వేల కోళ్లను చంపేసిన వైద్యబృందం.. శుక్రవారం మరో 6 వేల కోళ్లను చంపి, లోతైన గోతిలో పాతిపెట్టింది. కోళ్ల కోసం తీసుకొచ్చిన 5 టన్నుల దాణాతోపాటు, బర్డ్ ఫ్లూ సోకిన కోళ్లు పెట్టిన 14 వేల గుడ్లను సైతం వారు పగలగొట్టి అదే గోతిలో పారబోసి పూడ్చేశారు. ఫామ్ చుట్టూ సున్నం చల్లి శానిటైజ్ చేశారు. ఫామ్‌లోని ఐరన్ జాలీలను మంటతో శుద్ధి (ఫ్యూమిగేషన్) చేశారు.