Builders Association: బిల్లుల కోసం సత్యాగ్రహం చేస్తాం
ABN , Publish Date - Apr 08 , 2025 | 05:25 AM
కాంట్రాక్టర్లందరికీ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, మంత్రులకు విన్నవించినా ఫలితం లేకపోవడంతో గాంధీ మహాత్ముడిలా తామంతా సత్యాగ్రహం చేస్తామని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షుడు డీవీఎన్‌రెడ్డి, మాజీ అధ్యక్షులు బొల్లినేని శీనయ్య ప్రకటించారు.

బిల్డర్స్ అసోసియేషన్ నాయకుల వెల్లడి
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): కాంట్రాక్టర్లందరికీ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, మంత్రులకు విన్నవించినా ఫలితం లేకపోవడంతో గాంధీ మహాత్ముడిలా తామంతా సత్యాగ్రహం చేస్తామని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షుడు డీవీఎన్‌రెడ్డి, మాజీ అధ్యక్షులు బొల్లినేని శీనయ్య ప్రకటించారు. కొండాపూర్‌లో బిల్డర్స్ అసోసియేషన్ అఫ్ ఇండియా నూతన కార్యవర్గ సమావేశం సోమవారం నిర్వహించారు. బిల్డర్స్ అసోసియేషన్ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన డీవీఎన్‌రెడ్డిని అభినందించారు.
నూతనంగా ఎన్నికైన అసోసియేషన్ రాష్ట్ర చైర్మన్, సెంటర్ చైర్మన్లు, సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో డీవీఎన్‌రెడ్డి, బొల్లినేని శీనయ్య మాట్లాడుతూ.. గవర్నర్‌ను కలిసి సమస్యలు పరిష్కరించాలని కోరతామని తెలిపారు. కాంట్రాక్టర్లు తమ కార్యాలయాల్లో పని చేసేవారికి జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారని, ఇక నుంచి ప్రతీ ఆఫీసులో పని చేసే సిబ్బంది దీక్షలు చేయాలని కోరారు.