CM Revanth Reddy: పూర్వ స్థానాలకు తహ సీల్దార్లు, ఎంపీడీవోలు
ABN , Publish Date - Apr 06 , 2025 | 04:54 AM
రాష్ట్రంలో 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు బదిలీ అయిన తహసీల్దార్లు, ఎంపీడీవోలను తిరిగి పూర్వ స్థానాలకు పంపే ఫైలుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంతకం చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది.

బదిలీల ఫైలుపై సీఎం సంతకం!
అసెంబ్లీ ఎన్నికలకు ముందు వీరి బదిలీలు
హైదరాబాద్, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు బదిలీ అయిన తహసీల్దార్లు, ఎంపీడీవోలను తిరిగి పూర్వ స్థానాలకు పంపే ఫైలుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంతకం చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 2023 ఆగస్టులో రాష్ట్రవ్యాప్తంగా సొంత జిల్లాల్లో, ఒకే జిల్లాలో 3 ఏళ్ల సర్వీసు పూర్తయిన తహసీల్దార్లను ఇతర జిల్లాలకు బదిలీ చేశారు. అయితే ఎన్నికల తర్వాత తిరిగి పూర్వ స్థానాలకు బదిలీ చేసేవారు.
ఈసారి మాత్రం 20 నెలలైనా బదిలీలు జరగకపోవడంతో తహ సీల్దార్లు మానసిక వేదనకు గురవుతున్నారు. ఇదే సమస్యతో కామారెడ్డి జిల్లాలో ఓ తహ సీల్దారు మరణించారు. దీంతో బదిలీల అంశంపై పలు దఫాలుగా రెవెన్యూ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, టీజీవో సంఘం అధ్యక్షుడు ఏలూరి. శ్రీనివాసరావులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా పరిశీలించిన సీఎం రేవంత్‌రెడ్డి శనివారం సంబంధిత ఫైలుపై సంతకం చేసినట్టు సమాచారం. ఎన్నికల బదిలీల్లో భాగంగా బదిలీ అయిన 26మంది డిప్యూటీ తహసీల్దార్లు కూడా పూర్వ జిల్లాలకు బదిలీకానున్నారు.