ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TG News: జిల్లా కలెక్టర్లకు సీఎం రేవంత్ వార్నింగ్

ABN, Publish Date - Jan 10 , 2025 | 09:40 PM

District Collectors Meeting: జిల్లా కలెక్టర్లు సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని అమలు చేయాలని జిల్లా కలెక్టర్లను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

CM Revanth Reddy

హైదరాబాద్, జనవరి 10: గణతంత్ర దినోత్సవం జనవరి 26వ తేదీ నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నిర్ణయించారు. అందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. ఈ పథకాలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని అమలు చేయాలని జిల్లా కలెక్టర్లను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్‌లో జిల్లా కలెక్టర్ల సమావేశం జరిగింది . ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆకస్మిక తనిఖీల్లో భాగంగా జనవరి 26 వ తేదీ అనంతరం జిల్లాల పర్యటనకు వస్తానని తెలిపారు.

ఏ మాత్రం నిర్లక్ష్యం కనిపించినా కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఈ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా భావిస్తోందన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గణన సర్వే 96 శాతం పూర్తి చేసినందుకు జిల్లా కలెక్టర్లను సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించే కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేది జిల్లా కలెక్టర్లేనని ఆయన వివరించారు. కలెక్టర్ల పని తీరే.. ప్రభుత్వ పని తీరుకు కొలమానమని ఆయన అభివర్ణించారు.


కలెక్టర్లు.. తమ పని తీరును మరింత మెరుగు పరుచుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. క్షేత్ర స్థాయి పర్యటనలు చేయాలని గతంలోనే ఆదేశాలు ఇచ్చామని.. కానీ కొంత మంది ఇంకా ఆఫీసుల్లోనే కూర్చోని పని చేయాలని భావిస్తున్నారంటూ జల్లా కలెక్టర్లపై సీఎం రేవంత్ రెడ్డి ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలు ఎదురైనప్పుడు... సమర్ధవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. మీ పని తీరును మరింత మెరుగు పరుచుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్లకు ఈ సమావేశం వేదికగా కీలక సూచన చేశారు.

Also Read: తిరుపతిలో తొక్కిసలాట.. హైకోర్టులో పిల్

Also Read: టీటీడీ చైర్మన్‌, ఈవోలపై పవన్ కల్యాణ్ ఫైర్

Also Read: బ్రాండ్‌ ఏపీ ముందుకెళ్తోంది


వ్యవసాయ యోగ్యం కాని భూములకు కూడా గతంలో రైతు పెట్టుబడి సాయం అందించారని గుర్తు చేశారు. అనర్హులకు రైతు భరోసా ఇవ్వొద్దన్నారు. క్షేత్ర స్థాయిలోకి వెళ్లి అనర్హులను గుర్తించాల్సిందేనని జిల్లా కలెక్టర్లకు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు మాత్రమే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో వన్ రేషన్ వన్ స్టేట్ విధానాన్ని తీసుకు రాబోతున్నామని ఆయన ప్రకటించారు.

Also Read: ఆసుపత్రిలో పరామర్శ.. జగన్ గుట్టు విప్పిన మంత్రి ఆనం

Also Read: గత ప్రభుత్వం.. ప్రభుత్వ డెయిరీలను చంపేసింది

Also Read: జగనన్న కాలనీల పేరు మార్చిన ప్రభుత్వం


తెలంగాణలో ఒకరికి ఒక చోట మాత్రమే రేషన్ కార్డు ఉండాలని ఆదేశించారు. ఈ నెల 11 నుంచి 15 వ తేదీ లోగా పథకాల అమలుకు కావాల్సిన ప్రిపరేటరీ వర్క్ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అర్హుల జాబితాను ఇంచార్జి మినిస్టర్‌కు అందించాలని కలెక్టర్లకు సూచించారు. ఇంచార్జ్ మినిస్టర్ ఆమోదంతోనే కలెక్టర్లు.. అర్హుల జాబితాను విడుదల చేయాలన్నారు. ప్రభుత్వం పేదల కోసం పని చేస్తుందని.. గొప్పగా పని చేస్తుందన్న నమ్మకం ప్రజలకు కలిగించాలని జిల్లా కలెక్టర్లకు తెలిపారు.

Also Read: మృతుల ఇంటికి పాలక మండలి సభ్యులు..

Also Read: అంతరిక్షంలో త్రీగోర్జెస్ డ్యామ్ నిర్మాణానికి చైనా అడుగులు


ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నెలలో ఒక్కసారైనా హాస్టల్స్ విజిట్ చేసి రాత్రి బస చేయాలన్నారు. బాలికల హాస్టల్స్‌కు వెళ్లి.. అక్కడి విద్యార్థులకు స్ఫూర్తిని నింపాలని మహిళా అధికారులకు సూచించారు. సంక్షేమ ఫలాలు క్షేత్ర స్థాయికి చేరేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

For Telangana News And Telugu News

Updated Date - Jan 10 , 2025 | 09:40 PM