Srisailam: శ్రీశైలం ఖాళీ!
ABN, Publish Date - Jan 09 , 2025 | 05:31 AM
తెలుగు రాష్ట్రాల జీవనాడి శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు అడుగంటుతున్నాయి. ప్రస్తుతం డ్యాంలో నీటి నిల్వలు 105.39 టీఎంసీలకు పడిపోయాయి.
105 టీఎంసీలకు పడిపోయిన నీటిమట్టం
కర్నూలు, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల జీవనాడి శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు అడుగంటుతున్నాయి. ప్రస్తుతం డ్యాంలో నీటి నిల్వలు 105.39 టీఎంసీలకు పడిపోయాయి. ఇప్పటికే విద్యుదుత్పత్తి రూపంలో తెలంగాణ 358.94 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 199.38 టీఎంసీలను (మొత్తం 558.32 టీఎంసీలు) దిగువ నాగార్జునసాగర్‌కు వదిలేశాయి. రబీ పంటలు చేతికి రావాలంటే ఏప్రిల్ వరకు సాగునీరు ఇవ్వాల్సి ఉంది.
అయితే ఇరు రాష్ట్రాలు విద్యుద్పత్తి పేరిట పోటీ పడి దిగువకు నీటి విడుదల చేస్తుండటంపై పర్యావరణవేత్తలు, సాగునీటి నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నల్లమల అభయారణ్యంలో వన్యప్రాణుల మనుగడకు అవసరమైన మేరకు జలాశయంలో నిల్వలు ఉండేలా చూడాలంటున్నారు. ఇప్పటికైనా ఉన్న నీటి నిల్వలను జాగ్రత్తగా వాడుకోవాలని.. 90 టీఎంసీలకు తగ్గకుండా నిర్వహించాలని కోరుతున్నారు. ఆ దిశగా కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Updated Date - Jan 09 , 2025 | 05:31 AM