Cricket Accident: బాలుడి ప్రాణం తీసిన క్రికెట్ బాల్
ABN, Publish Date - Apr 09 , 2025 | 05:24 AM
క్రికెట్ బాల్ తగిలి ఓ బాలుడు మృతి చెందాడు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం రంగారావుపల్లి గ్రామానికి చెందిన దారం శ్రీనివా్‌సరెడ్డి వేములవాడలో తన కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు.
వేములవాడ, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): క్రికెట్ బాల్ తగిలి ఓ బాలుడు మృతి చెందాడు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం రంగారావుపల్లి గ్రామానికి చెందిన దారం శ్రీనివా్‌సరెడ్డి వేములవాడలో తన కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు. ఈ నెల 3న శ్రీనివా్‌సరెడ్డి కుమారుడు అశ్విత్‌రెడ్డి(9) తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడడానికి వెళ్లాడు. ప్రమాదవశాత్తూ క్రికెట్ బాల్ అశ్విత్ తలకు తగిలింది.
మరుసటి రోజు యథావిధిగా పాఠశాలకు వెళ్లిన అశ్విత్‌రెడ్డి, తనకు తలనొప్పిగా ఉందని చెప్పడంతో బాలుణ్ణి కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. తలలో గాయమై, రక్తస్రావం అవుతున్నట్లుగా గుర్తించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం అశ్విత్‌ను హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మంగళవారం అశ్విత్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
Updated Date - Apr 09 , 2025 | 05:25 AM