ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

‘ఫార్ములా ఈ’తో హైదరాబాద్‌ ఇమేజ్‌ పెరిగింది

ABN, Publish Date - Jan 11 , 2025 | 04:59 AM

‘ఫార్ములా ఈ రేస్‌’తో హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ పెరిగిందనడంలో ఏమాత్రం అనుమానం లేదు. ఈ రేస్‌ నిర్వహణతో అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించగలిగాం. ఇందులో అవినీతి ఉందా? లేదా? అనేది ఇప్పుడే చెప్పలేం.

  • హైడ్రా కారణంగా ప్రజలకు నష్టం కలుగుతోంది

  • ఆ డీసీపీ తీరుతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది

  • ఆయన ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేస్తే సంతోషం

  • ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్‌, జనవరి 10(ఆంధ్రజ్యోతి): ‘‘ఫార్ములా ఈ రేస్‌’తో హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ పెరిగిందనడంలో ఏమాత్రం అనుమానం లేదు. ఈ రేస్‌ నిర్వహణతో అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించగలిగాం. ఇందులో అవినీతి ఉందా? లేదా? అనేది ఇప్పుడే చెప్పలేం. అవినీతి లేదని కేటీఆర్‌ చెబుతున్నారు కదా..?’’ అని ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌ తరఫున గెలిచి అనంతరం కాంగ్రె్‌సలో చేరిన ఆయన.. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడడం కలకలం సృష్టిస్తోంది. హైడ్రా విషయంలో గతంలో తాను అన్న మాటలకు కట్టుబడి ఉంటానని కూడా దానం స్పష్టం చేశారు. ఓటు బ్యాంక్‌ అయిన ప్రజలను కాపాడుకోవాలని, హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఒక్క సీటు కూడా గెలవని సంగతిని గుర్తు చేశారు. ‘‘మన మీద నమ్మకం లేదు.


ఇప్పుడైనా నమ్మకాన్ని పెంపొందిచేందుకు ప్రయత్నించాలి. అదీ చేయలేకపోతున్నాం. ఇది ప్రభుత్వానికి ప్రమాదం కాదా?’’ అని వాఖ్యానించారు. హైదరాబాద్‌లోని ఒక డీసీపీ స్ధాయి అధికారిని ఉద్దేశించి మాట్లాడుతూ.. ఆయన ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేస్తే సంతోషం అని, ఎవరి మీదైనా కేసులు పెడతానంటూ వెళ్లడం వల్ల ప్రభుత్వం, ముఖ్యమంత్రికి చెడ్డ పేరు వస్తుందని దానం నాగేందర్‌ అన్నారు. ‘‘ఇలాంటి అధికారులు వస్తుంటారు.. పోతుంటారు. నేనెంతోమందిని చూశా (తలపై జుట్టును చూపుతూ)’’ అని పేర్కొన్నారు. కాగా, ఫార్ములా ఈ రేస్‌లో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ విచారణ జరుగుతుండగా, ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా దానం చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. వీటిపై నిఘా వర్గాలు ప్రభుత్వానికి నివేదిక అందించాయని తెలిసింది.

Updated Date - Jan 11 , 2025 | 04:59 AM