ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నేడు ఈడీ ముందుకు బీఎల్‌ఎన్‌ రెడ్డి

ABN, Publish Date - Jan 02 , 2025 | 02:59 AM

ఫార్ములా-ఈ కారు రేసు కేసులో ఏ3 నిందితుడిగా ఉన్న హెచ్‌ఏండీఏ మాజీ చీఫ్‌ ఇంజనీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డి గురువారం ఈడీ విచారణకు హాజరు కానున్నారు.

  • ఫార్ములా-ఈ కారు రేసు కేసులో ఏ3గా హెచ్‌ఏండీఏ మాజీ చీఫ్‌ ఇంజనీర్‌

  • రేపు అర్వింద్‌కుమార్‌ విచారణ.. ఈ నెల 7వ తేదీన కేటీఆర్‌..

  • ఫార్ములా-ఈ కారు రేసు కేసులో రేపు అర్వింద్‌కుమార్‌ విచారణ

హైదరాబాద్‌, జనవరి 1(ఆంధ్రజ్యోతి): ఫార్ములా-ఈ కారు రేసు కేసులో ఏ3 నిందితుడిగా ఉన్న హెచ్‌ఏండీఏ మాజీ చీఫ్‌ ఇంజనీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డి గురువారం ఈడీ విచారణకు హాజరు కానున్నారు. ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌ ఆఽధారంగా దర్యాప్తు ప్రారంభించిన ఈడీ అధికారులు.. బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌తో పాటు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అర్వింద్‌కుమార్‌, బీఎల్‌ఎన్‌ రెడ్డికి సమన్లు జారీ చేశారు. 7న విచారణకు రావాలని కేటీఆర్‌ను కోరారు. 3న అర్వింద్‌కుమార్‌ను విచారించనున్నారు. ఈడీ అధికారులు ఈ కేసులో కీలకమైన నిధుల బదిలీపై బీఎల్‌ఎన్‌ రెడ్డిని ప్రశ్నించనున్నారు.


తొలి ఒప్పందం పురపాలక శాఖ, ఎస్‌ నెక్ట్స్‌జెన్‌ కంపెనీ, ఎఫ్‌ఈవో మధ్య జరగ్గా, హెచ్‌ఏండీఏ నుంచి నిధులు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? మొదటి ఇన్వాయిస్‌ ప్రకారం రూ.22,69,63,125, రెండో ఇన్వాయిస్‌ ప్రకారం రూ.23,01,97,500 చెల్లించాలని మీకు రాతపూర్వక ఆదేశాలు ఇచ్చారా? మౌఖిక ఆదేశాలు అందాయా? అనే అంశాలపై ఈడీ ఆరా తీయనుంది. బీఎల్‌ఎన్‌ రెడ్డి చెప్పే విషయాల ఆధారంగా మర్నాడు అర్వింద్‌కుమార్‌ను ఈడీ విచారించనుంది.

Updated Date - Jan 02 , 2025 | 02:59 AM