పొంగులేటి క్యాబినెట్ మంత్రా? కాంట్రాక్టరా?
ABN, Publish Date - Mar 08 , 2025 | 04:50 AM
పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాబినెట్ మంత్రా? లేక కాంట్రాక్టరా? అని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు.

క్యాబినెట్ భేటీ కాదు.. మంత్రుల కుస్తీ పోటీ:ఏలేటి
హైదరాబాద్, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాబినెట్ మంత్రా? లేక కాంట్రాక్టరా? అని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని పొంగులేటి కుటుంబానికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీకి కేటాయించుకోవడం ఎంతవరకు సమర్థనీయమన్నారు. ఉదండపూర్ రిజర్వాయర్ పనులను రూ. 430 కోట్ల నుంచి రూ. 1150కోట్లకు రివైజ్డ్ అంచనాలు పెంచడాన్ని ఇద్దరు మంత్రులు ప్రశ్నించడంతో క్యాబినెట్‌లో రచ్చకు దారితీసిందన్నారు. ఆరు గంటల పాటు జరిగింది క్యాబినెట్ సమావేశం కాదని, మంత్రుల కుస్తీ పోటీ అని మహేశ్వర్ రెడ్డి ఎద్దేవా చేశారు. నీటిపారుదల ప్రాజెక్టుల రివైజ్డ్ అంచనాలు, నిధుల కేటాయింపులో సీఎంకు, ఒక పెద్ద మంత్రికి మధ్య వాగ్వాదం జరిగిందన్నారు.
Updated Date - Mar 08 , 2025 | 04:50 AM