ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Etela Rajender: కాంగ్రెస్‌ పార్టీకి పోయే కాలమొచ్చింది

ABN, Publish Date - Jan 09 , 2025 | 04:33 AM

‘బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్‌ గూండాలు చేసిన రాజకీయ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్‌ పార్టీకి పోయేకాలం వచ్చింది’ అంటూ మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • మాపై దాడులకు మూల్యం చెల్లించక తప్పదు

  • మేం తలుచుకుంటే ఎవ్వరూ మిగలరు: ఈటల

హైదరాబాద్‌, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): ‘బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్‌ గూండాలు చేసిన రాజకీయ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్‌ పార్టీకి పోయేకాలం వచ్చింది’ అంటూ మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక పథకం ప్రకారం ఒక పార్టీ నాయకులు ఇంకొక పార్టీ కార్యాలయంపై దాడి చేసిన ఘటనలు లేవన్నారు. నిరసన తెలిపే హక్కు అందరికీ ఉందని, దాడి చేయడం సరికాదని హితవు పలికారు. ‘రేవంత్‌ చేతిలో అధికారం ఉండొచ్చు.. కానీ మేం తలుచుకుంటే ఎవ్వరూ మిగలరు. దాడి చేయడం బీజేపీ సిద్ధాంతం కాదు, కానీ మాపై దాడి చేసిన వారిపై ప్రతి దాడి చేస్తాం’ అని హెచ్చరించారు. దాడులకు పాల్పడే వారు చిల్లర నాయకులు అవుతారు తప్ప పెద్ద నాయకులు కాలేరన్నారు. దాడికి ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అప్రజాస్వామికంగా చేస్తున్న దాడులకు మూల్యం చెల్లించక తప్పదన్నారు.


దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోండి

బీజేపీ కార్యాలయంపై దాడికి పాల్పడిన వారిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి ప్రశ్నించారు. తాము రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటున్నామని, కాంగ్రెస్‌ నాయకులు మాత్రం కేవలం రాజకీయాల కోసం రాజ్యాంగ పుస్తకాన్ని చూపిస్తారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ వాళ్లు చేసేది రౌడీయిజమన్నారు. పోలీసుల వైఫల్యంతోనే కాంగ్రెస్‌ కార్యకర్తలు, గూండాల దాడి జరిగిందన్నారు.

Updated Date - Jan 09 , 2025 | 04:33 AM