Fake Photo: సోషల్‌ మీడియాలో పెట్టిన కొన్ని ఫొటోలు నకిలీ..

ABN, Publish Date - Apr 05 , 2025 | 05:54 AM

యంత్రాలతో చెట్ల తొలగింపు ప్రక్రియ జరుగుతుండగా నెమళ్లు, ఇతర వన్యప్రాణులు భయంతో పారిపోతున్నట్లుగా సోషల్‌ మీడియాలో పెట్టిన ఫొటో నకిలీదని తేలిందని, ఆ ఫొటో 99 శాతం ఏఐతో తయారు చేసిందని వెల్లడించారు.

Fake Photo: సోషల్‌ మీడియాలో పెట్టిన కొన్ని ఫొటోలు నకిలీ..
  • సోషల్‌ మీడియాలో పెట్టిన కొన్ని ఫొటోలు, వీడియోలు తమ విచారణలో నకిలీవిగా తేలినట్లు సైబర్‌ క్రైం వర్గాలు తెలిపాయి.

1. యంత్రాలతో చెట్ల తొలగింపు ప్రక్రియ జరుగుతుండగా నెమళ్లు, ఇతర వన్యప్రాణులు భయంతో పారిపోతున్నట్లుగా సోషల్‌ మీడియాలో పెట్టిన ఫొటో నకిలీదని తేలిందని, ఆ ఫొటో 99 శాతం ఏఐతో తయారు చేసిందని వెల్లడించారు.


2. బీఆర్‌ఎస్‌ నేత క్రిశాంక్‌ జింక ఫొటోను పోస్ట్‌ చేసి, అది కంచ గచ్చిబౌలి భూముల్లో యంత్రాలకు బలైపోయిందంటూ పేర్కొన్నారు. ఆ ఫొటో కూడా నకిలీదని సైబర్‌ క్రైం అధికారుల విచారణలో తేలింది. అందులో జింక కాళ్లు కట్టేసి ఉన్నాయని, అది ఎక్కడో వేటాడిన జింక అని పేర్కొన్నారు. దానికి, కంచ గచ్చిబౌలి భూములకూ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అదే ఫొటోను పొరపాటున పోస్ట్‌ చేశానని, క్షమించాలంటూ జర్నలిస్ట్‌ సుమిత్‌ ఝా ‘ఎక్స్‌’లో చేసిన పోస్ట్‌ను కూడా విడుదల చేశారు.


3. ఓ ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్‌ ‘సేవ్‌ హెచ్‌సీయూ బయోడైవర్సిటీ’ అంటూ వీడియోను పోస్ట్‌ చేశారు. అది పాత వీడియో అని, జీవవైవిధ్యం గురించి చెప్పేందుకే పోస్ట్‌ చేసినట్లు ఇన్‌స్టా యూజరే తెలిపారు. అయితే, అందులో ఉన్నది విశాఖపట్నంలోని కంబాలకొండ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం నుంచి బయటకు వచ్చిన జింక అని సైబర్‌ క్రైం అధికారులు తేల్చారు. దానికి సంబంధించి విశాఖపట్నంలో ఓ ఇంటి ముందు మార్చి 14న మరో ఇన్‌స్టా యూజర్‌ పెట్టిన ఫొటోలోని అదే జింక ఫొటోను విడుదల చేశారు.

Updated Date - Apr 05 , 2025 | 05:54 AM