ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: కొత్తల్లుడికి 130 వంటకాలతో కొసరి కొసరి...

ABN, Publish Date - Jan 14 , 2025 | 03:48 AM

సంక్రాంతికి కొత్తల్లుడు ఇంటికొస్తే మర్యాద మూమూలే! పెళ్లయ్యాక మొదటి పండుగ కావడంతో ఆ అల్లూడూ అత్తింటికొచ్చాడు.

  • తెలంగాణ మార్కు వంటకాలతో మర్యాద ఉబ్బితబ్బిబ్బయిన ఆంధ్రా అల్లుడు

దిల్‌సుఖ్‌నగర్‌, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతికి కొత్తల్లుడు ఇంటికొస్తే మర్యాద మూమూలే! పెళ్లయ్యాక మొదటి పండుగ కావడంతో ఆ అల్లూడూ అత్తింటికొచ్చాడు. భోజనానికి పీటేసి కూర్చోబెట్టి పచ్చని అరిటాకు పరిచారు! పదార్థాలు వస్తూనే ఉన్నాయి వరదలా! పది, ఇరవై.. కాదు.. శాకాహార, మాంసాహార వంటకాలు, రకరకాల మిఠాయిలు, జ్యూస్‌లు, ఐస్‌క్రీమ్‌లు అన్నీ కలిపి 130 పదార్థాలు ముందర పెట్టారు. ఆయనకు కొసరి కొసరి వడ్డించారు. కాదనకుండా ప్రతిదీ రుచిచూసిన ఆ ఆంధ్రా అల్లుడు, సంప్రదాయ తెలంగాణ వంటకాల ఘుమఘుమలకు ఫిదా అయ్యాడు.


హైదరబాద్‌ గడ్డిఅన్నారం శారదనగర్‌కు చెందిన క్రాంతి, కల్పన దంపతులు తమ అల్లుడైన ఏపీలోని కాకినాడకు చెందిన మల్లికార్జున్‌కు చేసిన చిరస్మరణీయమైన మర్యాద ఇదీ! తమపెద్ద కుమార్తెను ఇటీవలే మల్లికార్జున్‌కు ఇచ్చి ఘనంగా పెళ్లి జరిపించారు. మొదటి సంక్రాంతి కావడంతో కొత్త దంపతులను ఇంటికి ఆహ్వానించారు. భోజనం పరంగా అత్తింటివారు ఊహించని రీతిలో చేసిన మర్యాదకు మల్లికార్జున్‌ ఉబ్బితబ్బిబ్బయ్యాడు.

Updated Date - Jan 14 , 2025 | 03:48 AM