Rice: సన్నబియ్యం వచ్చేశాయ్.. వచ్చే నెల నుంచే రేషన్‌షాపుల్లో పంపిణీ
ABN, Publish Date - Mar 28 , 2025 | 08:07 AM
రేవంత్ సర్కార్ ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో హామీని నిలబెట్టుకునే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. రేషన్ కార్డువారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తామని అప్పట్లో హామీ ఇచ్చింది. ఆ హామీని అమలు చేసేందుకుగానూ వచ్చే నెల నుంచి రేషన్ కార్డువారులకు సన్నబియ్యం పంపిణీ చేయనున్నారు.

హైదరాబాద్ సిటీ: రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీకి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. జిల్లా పరిధిలో ఉన్న మొత్తం 653 రేషన్ దుకాణాలకు సన్న బియ్యాన్ని తరలించే కార్యక్రమాన్ని పౌర సరఫరాల శాఖ అధికారులు చేపట్టారు. అవసరమైన స్టాకును ముందుగానే తీసుకొచ్చి జిల్లాలోని 9గోదాముల్లో భద్ర పరిచారు. అక్కడి నుంచి రేషన్‌షాపులకు తరలించే ప్రక్రియను కూడా ప్రారంభించారు. సుమారు 15వేల మెట్రిక్ టన్నుల సన్న బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా ఏప్రిల్ 1 నుంచే లబ్దిదారులకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: న‘గరం’ @ 40.. పెరుగుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు
జిల్లాలో 6.40 లక్షల కార్డులు
జిల్లాలో మొత్తం రేషన్‌కార్డులు 6.40 లక్షలు ఉండగా, లబ్ధిదారులు 23 లక్షల మంది ఉంటారని జిల్లా చీఫ్ రేషనింగ్ అధికారి జి.ఫణీంద్ర రెడ్డి(Chief Rationing Officer G. Phanindra Reddy) తెలిపారు. ఇప్పటి వరకు ఇచ్చినట్లుగానే అంత్యోదయ అన్న యోజన కార్దుదారులకు 35 కేజీలు, అన్నపూర్ణ కార్డుదారులకు 10 కిలోలు, మిగతా కార్డుదారు (నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కార్డులు, స్టేట్ ఫుడ్ సెక్యూరిటీ కార్డులు)లకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున కార్డులో ఎంత మంది ఉంటే వారందరికీ సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అంత్యోదయం అన్న యోజన కార్డుదారులు సుమారు 3వేలు, అన్నపూర్ణ కార్డు దారులు 1500 మంది ఉన్నారని, కార్దుదారులందరికీ నిర్ణీత సమయంలో బియ్యాన్ని పంపిణీ చేస్తామని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ఎమ్మెల్యే సత్యంను బెదిరించిన వ్యక్తికి బెయిల్
పాస్టర్ ప్రవీణ్‌కు అంతిమ వీడ్కోలు
మాజీ మంత్రి హరీష్ రావుపై మరో కేసు నమోదు
గుమ్మడిదలను మరో లగచర్ల చేయొద్దు..
Read Latest Telangana News and National News
Updated Date - Mar 28 , 2025 | 08:07 AM