Raxaul Express: రక్సెల్ ఎక్స్‌ప్రెస్‌లో బాలికపై లైంగిక వేధింపులు: బిగ్ ట్విస్ట్
ABN, Publish Date - Apr 04 , 2025 | 08:43 PM
Raxaul Express: రక్సెల్ ఎక్స్‌ప్రెస్‌లో బాలికపై లైంగిక వేధింపుల కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. 12 ఏళ్ల బాలికపై లైంగిక దాడి జరిగినట్లు వైద్యులు నిర్దారించారు. దీంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీంతో చేసిన తప్పును అతడు ఒఫ్పుకున్నాడు. దాంతో అతడిపై ఫోక్స్ చట్టం కింద కేసు నమోదు చేశారు. మరోవైపు బాలికను రహస్య ప్రదేశంలో ఉంచి విచారణ జరుపుతోన్నారు.

హైదరాబాద్, ఏప్రిల్ 04: రక్సెల్ - సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ రైల్‌లో 12 ఏళ్ల బాలికను లైంగికంగా వేధింపులకు గురి చేసిన ఘటనలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. సదరు బాలికను అత్యాచారం చేసినట్లు వైద్యులు తమ వైద్య పరీక్షల ద్వారా నిర్ధారించారు. ఈ కేసులో నిందితుడు.. తన తప్పును ఒప్పుకున్నాడు. దీంతో నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరోవైపు బాలికను రహస్య ప్రదేశంలో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై సికింద్రాబాద్ రైల్వే పోలీసులు.. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు.
ఇంతకీ ఏం జరిగిందంటే..
హైదరాబాద్ మహానగరంలోని చారిత్రక ప్రదేశాలను చూసేందుకు ఓ కుటుంబం.. ఒడిశా నుంచి హైదరాబాద్‌కు రక్సెస్ ఎక్స్‌ప్రెస్ రైలులో బయలుదేరింది. అర్థరాత్రి 2.00 గంటల సమయంలో 12 ఏళ్ల బాలిక రైలులోని వాష్ రూమ్‌కు వెళ్లింది. ఈ విషయాన్ని పసిగట్టిన 25 యువకుడు ఆ వెంటనే వాష్ రూమ్‌కు వెళ్లి.. బాలికపై లైంగిక వేధింపులకు గురి చేసి.. వీడియోలను చిత్రీకరించాడు. దీంతో ఈ విషయాన్ని సదరు బాలిక తన కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో సదరు వ్యక్తిని ఇతర ప్రయాణికుల సహాయంతో వారు బంధించారు.అనంతరం అతడి సెల్ ఫోన్‌లోని వీడియోలను పరిశీలించారు.
దీంతో 139కి కాల్ చేసి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రైల్వే పోలీసులు రంగంలోకి దిగి.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారించగా.. చేసిన తప్పును ఒప్పుకున్నాడు. అయితే నిందితుడు రంజన్ కుమార్.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ సంస్థలో ఇంజినీర్‌గా పని చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కేల్జార్ రైల్వే స్టేషన్ దాటుతున్న సమయంలో ఈ దారుణం చోటు చేసుకున్నట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు వివరించారు. అయితే నిందితుడిపై ఫోక్సా చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Toothbrush: టూత్ బ్రష్ వాడుతున్నారా.. ఇవి తెలుసుకోకపోతే అంతే సంగతులు..
Kazakhstan: చర్చనీయాంశంగా మారిన కజకిస్తాన్ దేశం.. అక్కడ దొరికింది చూస్తే..
Vijaya Dairy Price Revision: పాడి రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన విజయ డెయిరీ..
Updated Date - Apr 04 , 2025 | 08:43 PM