హామీలు నెరవేర్చలేక ప్రభుత్వం అభాసుపాలు
ABN , Publish Date - Apr 15 , 2025 | 12:37 AM
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక కాంగ్రెస్ ప్రభుత్వం అభాసుపాలైందని మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు.

మాజీమంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి
సూర్యాపేట(కలెక్టరేట్), హుజూర్‌నగర్, ఏప్రిల్ 14,(ఆంధ్రజ్యోతి): ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక కాంగ్రెస్ ప్రభుత్వం అభాసుపాలైందని మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు.వరంగల్‌లో నిర్వహించే బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ విజయవంతం కోసం సోమవారం జిల్లాకేంద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు బంధు, రైతు బీమా, రైతు భరోసా ఇవ్వకపోగా, రుణమాఫీ పూర్తిగా చేయలేదన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం ఆసరా పింఛన్లు పెంచకపోగా ఉన్న పింఛన్లు సమయానికి ఇవ్వడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకుల మాయ మాటలకు మోసపోయిన ప్రజలు నేడు గోసపడుతున్నారన్నారు. ఈనెల 27న వరంగల్‌లో నిర్వహించే సభ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఆత్మకూర్(ఎస్) మండలం మంగళితండాతో పాటు పలు గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే జగదీ్‌షరెడ్డి సమక్షంలో బీఆర్‌ఎ్‌సలో చేరారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్, రాష్ట్ర నాయకులు ఒంటెద్దు నర్సింహారెడ్డి, వై.వెంకటేశ్వర్లు, నాయకులు గోపగాని వెంకటనారాయణగౌడ్, నిమ్మల శ్రీనివా్‌సగౌడ్, పెరుమాళ్ల అన్నపూర్ణ, మారిపెద్ది శ్రీనివా్‌సగౌడ్, పుట్టా కిశోర్‌కు మార్, మొరిశెట్టి శ్రీనివాసులు, సవరాల సత్యనారాయణ, బూర బాలసైదులుగౌడ్, కొణతం సత్యనారాయణరెడ్డి, నెమ్మాది భిక్షం, తూడి నర్సింహారావు పాల్గొన్నారు. కాగా, బీఆర్‌ఎస్ సభ విజయవంతం కావాలని విశ్రాంత ఉద్యోగి నర్సింహాచారి జగదీ్‌షరెడ్డికి రూ.1016లను చెక్కు ద్వారా విరాళం అందజేశారు.
హుజూర్‌నగర్‌లో ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ, సీఎం రేవంత్‌రెడ్డి సభకు జిల్లాలోని ఒక్కొక్క మిల్లు నుండి కోటి రూపాయల చొప్పున వసూలు చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మిల్లర్లతో కుమ్మక్కైందని, అందుకే బస్తా ధాన్యం ధర రూ.1200లు, 1500లు అంటున్నారని విమర్శించారు. మిల్లర్లు, ప్రభుత్వం కుమ్మక్కు అవటంతో కనీస మద్దతు ధర 2,320, బోనస్ 500 కలిపి 2,820 రావల్సి ఉండగా, తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. హుజూర్‌నగర్ నుండే కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుందన్నారు.