BRS: ప్రజాపాలన కాదు.. ప్రతీకార పాలన: హరీశ్‌రావు
ABN, Publish Date - Jan 13 , 2025 | 04:44 AM
రాగద్వేషాలకతీతంగా పరిపాలన సాగిస్తానని ప్రమాణం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి ప్రతీకార పాలన తప్ప ప్రజాపాలన చేయడం లేదని మాజీమంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు.
సిద్దిపేట టౌన్, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): రాగద్వేషాలకతీతంగా పరిపాలన సాగిస్తానని ప్రమాణం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి ప్రతీకార పాలన తప్ప ప్రజాపాలన చేయడం లేదని మాజీమంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. అన్ని వర్గాలను వంచించిన సీఎం రేవంత్‌రెడ్డి ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా, ప్రజల దృష్టి మళ్లించేందుకు హింసా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్రాన్ని రావణకాష్టంగా మారుస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం వద్దే హోంమంత్రి పదవి ఉందని, ఆయనే హింసాత్మక సంఘటనలను ప్రోత్సహిస్తే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయా అని ప్రశ్నించారు. పదేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో కాంగ్రెస్ కార్యాలయాలపై ఏనాడైనా దాడులు జరిగాయా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం దాడుల సంస్కృతి మారకుంటే కేంద్రం జోక్యం చేసుకోవాలని, రాష్ట్రపతి పాలన విధించి శాంతిభద్రతలను కాపాడాలని ఆయన కోరారు.
Updated Date - Jan 13 , 2025 | 04:44 AM