Share News

Meenakshi Natarajan: ఆ భూములను హెచ్‌సీయూకే ఇవ్వాలి

ABN , Publish Date - Apr 07 , 2025 | 05:24 AM

కంచ గచ్చిబౌలి భూములను హెచ్‌సీయూకే రిజిస్టర్‌ చేయించాలని ఆ యూనివర్సిటీ అధ్యాపకులు, విద్యార్థులు రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్‌ను కోరారు.

Meenakshi Natarajan: ఆ భూములను హెచ్‌సీయూకే ఇవ్వాలి

  • మీనాక్షీ నటరాజన్‌కు విద్యార్థుల వినతి

  • కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై.. అధ్యాపకులు, విద్యార్థులతో మీనాక్షి భేటీ

  • ప్రొఫెసర్లు, ఎన్జీవో ప్రతినిధులతోనూ సమావేశం.. అభిప్రాయ సేకరణ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): కంచ గచ్చిబౌలి భూములను హెచ్‌సీయూకే రిజిస్టర్‌ చేయించాలని ఆ యూనివర్సిటీ అధ్యాపకులు, విద్యార్థులు రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్‌ను కోరారు. మొత్తం భూమిని వర్సిటీకి రిజిస్టర్‌ చేయడమే కాకుండా.. బయోడైవర్సిటీ హెరిటేజ్‌ జోన్‌గా ప్రకటించేలా చూడాలన్నారు. ఆదివారం మీనాక్షి.. గచ్చిబౌలి స్టేడియంలో హెచ్‌సీయూ అధ్యాపకులు, విద్యార్థులతో సమావేశమయ్యారు. కంచ గచ్చిబౌలి భూ ముల వివాదంపై వారి అభిప్రాయాలు సేకరించారు. ఈ భూ ముల వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో.. దీని పై నిజనిర్ధారణకు అభిప్రాయ సేకరణ చేపట్టాలని మీనాక్షీ నటరాజన్‌కు ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ సూచించినట్లు తెలుస్తోంది. రాహుల్‌ సూచన మేరకే శనివారం హైదరాబాద్‌కు వచ్చిన మీనాక్షి.. నేరుగా సచివాలయానికి వెళ్లి గచ్చిబౌలి భూములపై ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీని కలిసి వారి అభిప్రాయాలు తీసుకున్నారు.


ఆదివారం హెచ్‌సీయూ అధ్యాపకులు, విద్యార్థులతోపాటు కాంగ్రెస్‌ నేతలు, ప్రజాసంఘాల ప్రతినిధుల నుంచి కూడా ఆమె సమాచారం సేకరించినట్లు తెలిసింది. సోమవారమూ అభిప్రాయాలు సేకరించి.. సాయంత్రం అ హ్మదాబాద్‌కు వెళ్లనున్నారు. ఈ నెల 8, 9 తేదీల్లో అహ్మదాబాద్‌లో ఏఐసీసీ విస్తృత స్థాయి సమావేశం, సీడబ్ల్యూసీ భేటీ జరగనున్న సంగతి తెలిసిందే. కాగా, కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై హైదరాబాద్‌లో సేకరించిన అభిప్రాయాలపై నివేదికను అహ్మదాబాద్‌లో రాహుల్‌గాంధీకి మీనా క్షీ నటరాజన్‌ ఇవ్వనున్నట్లు చెబుతున్నారు. ఆ నివేదికను పరిశీలించి.. రాష్ట్ర ప్రభుత్వానికి ఏఐసీసీ నాయకత్వం దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది.

Updated Date - Apr 07 , 2025 | 05:24 AM