Tirumala: శ్రీవారి సేవలో తెలంగాణ హైకోర్టు సీజే
ABN , Publish Date - Apr 14 , 2025 | 03:47 AM
తిరుమల శ్రీవారిని పలు రాష్ర్టాల హైకోర్టు న్యాయమూర్తులు ఆదివారం దర్శించుకున్నారు.

తిరుమల, ఏప్రిల్ 13(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారిని పలు రాష్ర్టాల హైకోర్టు న్యాయమూర్తులు ఆదివారం దర్శించుకున్నారు. తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్‌పాల్, ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్(మేనేజ్‌మెంట్) రామకృష్ణ, గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్, మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకటరమణ, పాట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభిషేక్‌రెడ్డి, మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరుళ్ మురుగన్ శ్రీవారి దర్శించుకోగా, ఆలయ అధికారులు లడ్డూప్రసాదాలు అందజేశారు.