భాగ్యలక్ష్మి ఆలయం స్వాధీన ఉత్తర్వులపై స్టే

ABN, Publish Date - Mar 01 , 2025 | 05:10 AM

చార్మినార్‌ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయాన్ని దేవాదాయశాఖ స్వాధీనం చేసుకోవాలంటూ ట్రైబ్యునల్‌ ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది. ఈ మేరకు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.

భాగ్యలక్ష్మి ఆలయం స్వాధీన ఉత్తర్వులపై స్టే

చార్మినార్‌ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయాన్ని దేవాదాయశాఖ స్వాధీనం చేసుకోవాలంటూ ట్రైబ్యునల్‌ ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది. ఈ మేరకు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఆలయాన్ని స్వాధీన పరచాలంటూ ఈ నెల 21న ట్రైబ్యునల్‌ ఇచ్చిన ఆదేశాలను సవాల్‌ చేస్తూ భాగ్యలక్ష్మి ఆలయ వ్యవస్థాపకుడు రాజ్‌మోహన్‌దా్‌స కుమార్తె శశికళ తదితరులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ అలిశెట్టి లక్ష్మీనారాయణ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విని ట్రైబ్యునల్‌ ఉత్తర్వులపై స్టే విధించింది.

Updated Date - Mar 01 , 2025 | 05:10 AM