ఎన్టీఆర్‌ ఘాట్‌కు మరమ్మతులు

ABN, Publish Date - Jan 21 , 2025 | 05:03 AM

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ను పరిశీలించి మరమ్మతులు వెంటనే చేపట్టాలంటూ హెచ్‌ఎండీఏ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ సోమవారం అధికారులకు ఆదేశాలిచ్చారు.

ఎన్టీఆర్‌ ఘాట్‌కు మరమ్మతులు
  • పనులు చేపట్టాలన్న హెచ్‌ఎండీఏ కమిషనర్‌

  • దెబ్బతిన్న ఘాట్‌ పరిసరాలను చూసి

  • వర్ధంతి నాడు ఎన్టీఆర్‌ అభిమానుల ఆగ్రహం

  • ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నారా లోకేశ్‌ అసహనం

హైదరాబాద్‌ సిటీ, జనవరి20 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ను పరిశీలించి మరమ్మతులు వెంటనే చేపట్టాలంటూ హెచ్‌ఎండీఏ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ సోమవారం అధికారులకు ఆదేశాలిచ్చారు. 25 ఏళ్ల క్రితం ఎన్టీఆర్‌ ఘాట్‌ నిర్మితమైనప్పటి నుంచి నిర్వహణ బాధ్యతలను హెచ్‌ఎండీఏ చూసుకుంటోంది. జయంతులు, వర్ధంతుల సందర్భంగా పూలతో అలంకరణ ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఇటీవల ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా నిర్వహణలో లోపాలు కనిపించాయి. దీంతో ఏపీ మంత్రి నారా లోకేశ్‌తోపాటు.. ఎన్టీఆర్‌ కుటుంబీకులు, ప్రముఖులు, అభిమానులు అసంతృప్తి వ్యక్తంచేశారు. లోకేశ్‌ తన సొంత నిధులతో మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. దీనిపై స్పందించిన హెచ్‌ఎండీఏ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌.. ఎన్టీఆర్‌ ఘాట్‌కు మరమ్మతులు చేపట్టాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.

Updated Date - Jan 21 , 2025 | 05:03 AM