Share News

Hyderabad: విద్యుత్‌కు భారీ డిమాండ్‌.. ఆ మూడు సర్కిళ్లలోనే అధికం

ABN , Publish Date - Feb 28 , 2025 | 08:03 AM

గ్రేటర్‌ వ్యాప్తంగా విద్యుత్‌ డిమాండ్‌ భారీగా పెరుగుతోంది. అయితే, అత్యధికంగా హబ్సిగూడ, సైబర్‌సిటీ, మేడ్చల్‌ సర్కిళ్లలో(Habsiguda, Cybercity, Medchal Circle) నమోదవుతోంది. ఫిబ్రవరిలోనే డిమాండ్‌ 3,400 మెగావాట్లకు చేరడంతో ఈ సంవత్సరం 5వేల మెగావాట్లు దాటుతుందని అధికారులు చెబుతున్నారు.

 Hyderabad: విద్యుత్‌కు భారీ డిమాండ్‌.. ఆ మూడు సర్కిళ్లలోనే అధికం

- హబ్సిగూడ, సైబర్‌సిటీ, మేడ్చల్‌పై డిస్కం ప్రత్యేక దృష్టి

హైదరాబాద్‌ సిటీ: గ్రేటర్‌ వ్యాప్తంగా విద్యుత్‌ డిమాండ్‌ భారీగా పెరుగుతోంది. అయితే, అత్యధికంగా హబ్సిగూడ, సైబర్‌సిటీ, మేడ్చల్‌ సర్కిళ్లలో(Habsiguda, Cybercity, Medchal Circle) నమోదవుతోంది. ఫిబ్రవరిలోనే డిమాండ్‌ 3,400 మెగావాట్లకు చేరడంతో ఈ సంవత్సరం 5వేల మెగావాట్లు దాటుతుందని అధికారులు చెబుతున్నారు. గతేడాది వేసవిలో గ్రేటర్‌ వ్యాప్తంగా 61 సబ్‌స్టేషన్లలో లోడ్‌ గ్రోత్‌ 30 శాతం నుంచి 87 శాతం వరకు నమోదయింది.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: హెచ్‌సీయూలో కుప్పకూలిన నిర్మాణం


ఈ లెక్కల ఆధారంగా మూడు సర్కిళ్ల పరిధిలో మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో విద్యుత్‌ సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా దక్షిణ డిస్కం ప్రత్యేక దృష్టి సారించింది. లోడ్‌ గ్రోత్‌ అధికంగా ఉన్న సబ్‌స్టేషన్లను టీజీఎస్పీడీసీఎల్‌ సీఎండీ ముషారఫ్‌ ఫరూఖీ ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. 11 కేవీ ఫీడర్లపై 60-70 శాతం లోడ్‌ దాటకుండా ఫీడర్ల విస్తరణ చేపట్టి ఓవర్‌లోడ్‌ పడకుండా చర్యలు చేపట్టారు. హబ్సిగూడ, సైబర్‌సిటీ, మేడ్చల్‌ సర్కిళ్లలో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం రాకుండా 963 అదనపు డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశారు.


city4.jpg

సైబర్‌సిటీ సర్కిల్‌లోని సబ్‌స్టేషన్లలో 25 పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్లు (పీటీఆర్‌) అదనంగా దక్షిణ డిస్కం ఏర్పాటు చేసింది. సమ్మర్‌లో పెరిగే డిమాండ్‌కు అనుగుణంగా మేడ్చల్‌ సర్కిల్‌లో 24, హబ్సిగూడ సర్కిల్‌ పరిధిలోని సబ్‌స్టేషన్లలో 14పీటీఆర్‌లు ఏర్పాటు చేశారు. దక్షిణ డిస్కం చేపట్టిన పనులు 90 శాతం పూర్తవగా మార్చి 15 నాటికి వందశాతం పనులు పూర్తిచేస్తామని ఆపరేషన్‌ అధికారులు వెల్లడిస్తున్నారు.


హబ్సిగూడలో 9.17 లక్షల విద్యుత్‌ కనెక్షన్లు

గ్రేటర్‌ పరిధిలోని మెట్రో, రంగారెడ్డి, మేడ్చల్‌ జోన్లలో(Metro, Ranga Reddy, and Medchal zones) మొత్తం 66.74 విద్యుత్‌ కనెక్షన్లు ఉండగా అత్యధికంగా హబ్సిగూడ సర్కిల్‌లో 9.17 లక్షలు, మేడ్చల్‌లో 8.61 లక్షలు, సైబర్‌ సిటీ సర్కిల్‌లో 6.64 లక్షల కనెక్షన్లు ఉన్నాయి.


ఈవార్తను కూడా చదవండి: ఎస్‌ఎల్‌బీసీ అత్యంత క్లిష్టమైన టన్నెల్‌

ఈవార్తను కూడా చదవండి: రేవంత్ ప్రభుత్వంలో ఆ స్కీమ్ బాగుంది

ఈవార్తను కూడా చదవండి: తెలంగాణ పర్యటనకు కాంగ్రెస్ అగ్రనేత..

ఈవార్తను కూడా చదవండి: అభివృద్ధి పనులు పెండింగ్‌ లేకుండా చూడాలి

Read Latest Telangana News and National News

Updated Date - Feb 28 , 2025 | 08:03 AM