BLN Reddy: ఏసీబీ విచారణలో బీఎల్ఎన్ రెడ్డి కీలక విషయాలు వెల్లడి..
ABN , Publish Date - Jan 10 , 2025 | 04:31 PM
తెలంగాణ: ఫార్ములా-ఈ కార్ రేస్ కేసు (Formula-E car race case)లో హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి (BLN Reddy) ఏసీబీ (ACB) విచారణ కొనసాగుతోంది. ఇవాళ (శుక్రవారం) దాదాపు 6 గంటలుగా బీఎల్ఎన్ రెడ్డిని ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
హైదరాబాద్: ఫార్ములా-ఈ కార్ రేస్ కేసు (Formula-E car race case)లో హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి (BLN Reddy) ఏసీబీ (ACB) విచారణ కొనసాగుతోంది. ఇవాళ (శుక్రవారం) దాదాపు 6 గంటలుగా బీఎల్ఎన్ రెడ్డిని ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ రికార్డులను పరిశీలించిన ఏసీబీ అధికారులు వాటిని బీఎన్‌ఎల్ రెడ్డి ముందు ఉంచి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. హెచ్ఎండీఏ బోర్డు ఖాతా నుంచి ఎఫ్ఈవోకు రూ.55 కోట్లు రిలీజ్ చేయడంలో బీఎల్ఎన్ రెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు ఏసీబీ భావిస్తోంది. ఈ మేరకు నేడు విచారణ చేపట్టింది.
Rammohan Reddy: జబర్దస్త్ కామిడీ షో లా కేటీఆర్ తీరు
అయితే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఆదేశాలతోనే నగదు రిలీజ్ చేసినట్లు విచారణలో బీఎల్ఎన్ రెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాను ప్రొసీడింగ్స్ అన్ని పూర్తి చేశానని రెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. ఇందులో తన సొంత ప్రయోజనాలు ఏమీ లేవని ఏసీబీ అధికారులకు బీఎల్ఎన్ రెడ్డి వివరించినట్లు సమాచారం. ఒకవైపు మంత్రి కేటీఆర్.. మరోవైపు పైఅధికారి ఒత్తిడి వల్లే రూ.55 కోట్లకు సంబంధించి తాను ప్రొసీడింగ్స్ చేసినట్లు బీఎల్ఎల్ రెడ్డి విచారణలో చెప్పారు.
Game Changer: అసెంబ్లీలో చెప్పింది ఒట్టిదేనా.. సీఎంపై హరీష్ రావు ఫైర్..
నగదు బదిలీ చేస్తే భవిష్యత్తులో ఇరుక్కుపోతామని తనకు ముందే తెలుసని ఏసీబీ అధికారులకు బీఎల్ఎన్ రెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. అయినా అప్పటి పరిస్థితుల వల్లే నిబంధనలకు విరుద్ధంగా ముందుకు వెళ్లాల్సి వచ్చినట్లు చెప్పినట్లు సమాచారం. తాను ఏసీబీ విచారణకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానని, ఈడీ అడిగిన ప్రశ్నలనే మీరూ అడుగుతున్నారని ఏసీబీ అధికారులకు ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. ఈడీ అడిగిన ప్రశ్నలన్నిటికీ తాను సమాధానం ఇచ్చానని, ఏసీబీ విచారణలో బీఎల్ఎన్ రెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
TG Highcourt: ఆ షోలు రద్దు చేశామంటూ మళ్లీ ఏంటిది.. హైకోర్టు అసంతృప్తి
TG News: షాకింగ్ న్యూస్.. పది అడుగుల లోతులో పడ్డ భారీ ట్రక్