Share News

Lift Accident: మరో లిఫ్ట్ ప్రమాదం.. ఒక్కసారిగా మీద పడి.. బాబోయ్..

ABN , Publish Date - Apr 13 , 2025 | 08:10 PM

హైదరాబాద్ సూరారంలో దారుణం జరిగింది. శ్రీకృష్ణనగర్ మణికంఠ అపార్ట్‌మెంట్‌ వద్ద కొంతమంది చిన్నారులు క్రికెట్ ఆడుకుంటున్నారు. అనుకోకుండా బాల్ లిఫ్ట్ గుంతలో పడిపోయింది.

Lift Accident: మరో లిఫ్ట్ ప్రమాదం.. ఒక్కసారిగా మీద పడి.. బాబోయ్..
Lift Accident

హైదారాబాద్: ఇటీవల కాలంలో లిఫ్ట్ ప్రమాదాలు(Lift Accident) పెరిగిపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వరస ప్రమాదాలు లిఫ్ట్ ఎక్కాలంటేనే భయం రేకెత్తిస్తున్నాయి. తాజాగా మరో లిఫ్ట్ ప్రమాదం హైదరాబాద్ (Hyderabad) మహానగరంలో చేటు చేసుకుంది. సూరారం శ్రీకృష్ణ నగర్ (Suram Srikrishna Nagar) మణికంఠ అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్ కింద పడి ఓ వ్యక్తి మృతిచెందాడు. ఆదివారం మధ్యాహ్నం అపార్ట్‌మెంట్ వద్ద కొంతమంది చిన్నారులు క్రికెట్ ఆడుకుంటున్నారు. అనుకోకుండా బాల్ లిఫ్ట్ గుంతలో పడిపోయింది.


స్థానికంగా ఉంటున్న ఆర్ఎంపీ వైద్యుడు అక్బర్ పటేల్ బాల్ తీసేందుకు గుంతలోకి దిగాడు. అదే సమయంలో 5వ అంతస్తు నుంచి లిఫ్ట్ ఆన్ చేయడంతో ఒక్కసారిగా అతనిపై పడింది. దీంతో అక్కడికక్కడే అక్బర్ ప్రాణాలు కోల్పోయారు. అయితే బిల్డర్ తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెల్లార్‌లోని లిఫ్ట్ గోడలు నాలుగు వైపులా తెరిచి ఉన్నాయని, కనీసం ఎలాంటి రక్షణ ఏర్పాట్లూ చేయలేదని మండిపడుతున్నారు. బిల్డర్‌పై చర్యలు తీసుకోవాలని, మృతుడు అక్బర్ ముగ్గురు పిల్లలకు ప్రభుత్వం అండగా నిలవాలని కోరుతున్నారు.


ఆసిఫ్‌నగర్‌లో ఏప్రిల్ ఏడో తేదీన మరో ప్రమాదం సంభవించింది. ఓ అపార్ట్‌మెంట్‌ ఐదో అంతస్తు నుంచి లిఫ్ట్ ఒక్కసారిగా కిందపడింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలు అవ్వగా.. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో లిఫ్ట్‌లో ఆరుగురు ఉన్నారు. లిఫ్ట్‌ పైకి వెళ్లి కిందకు వచ్చే క్రమంలో ఒక్కసారిగా పట్టు కోల్పోయి గ్రౌండ్ ఫ్లోర్‌లో పడిపోయింది. అలాగే మార్చి 12 అదే ఆసిఫ్‌నగర్‌ పరిధి సంతోశ్ నగర్‌లో మరో ప్రమాదం చోటు చేసుకుంది. లిఫ్ట్‌లో ప్రమాదవశాత్తూ ఇరుక్కుపోయి సంవత్సరం వయసున్న బాలుడు మృతిచెందాడు. మరోవైపు నాంపల్లిలో లిఫ్ట్‌, అపార్ట్‌మెంట్‌ గోడ మధ్య ఇరుక్కుపోయి ఆరు సంవత్సరాల వయసున్న మరో బాలుడు మృతిచెందాడు.


ఈ వార్తలు కూడా చదవండి:

ABV Political Entry: జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా.. అందుకే రాజకీయాల్లోకి వస్తున్నా: రిటైర్డ్ ఐపీఎస్

Harish Rao: సన్నబియ్యం పేరుతో పేదల్ని మోసం చేస్తున్నారు: ఎమ్మెల్యే హరీశ్ రావు..

MLA Komatireddy: నాకు మంత్రి పదవి రాకుండా చూస్తోంది అతనే: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి..

Updated Date - Apr 13 , 2025 | 09:21 PM