ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TG Highcourt: నాట్‌ టు అరెస్ట్.. పుష్ప నిర్మాతలకు హైకోర్టులో ఊరట

ABN, Publish Date - Jan 02 , 2025 | 12:30 PM

Telangana: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో నిందితులుగా చేర్చడంపై పుష్ప నిర్మాతలు హైకోర్టును ఆశ్రయించారు. మైత్రి మూవీస్ నిర్మాతలు యలమంచిలి రవిశంకర్, యర్నేని నవీన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై ఈరోజు (గురువారం) హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ కేసులో తమ ప్రమేయం లేదని.. కేసును కొట్టేయాలని నిర్మాతలు కోరారు.

Big releif to pushpa producers in Telangana High Court

హైదరాబాద్, జనవరి 2: సంధ్య థియేటర్ కేసులో పుష్ప నిర్మాతలకు తెలంగాణ హైకోర్టులో (Telangana Highcourt) ఊరట లభించింది. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటపై (Sandhya Theater stampede Case) పుష్ప సినిమా నిర్మాతలను పోలీసులు నిందితులుగా చేర్చారు. తదుపరి ఆదేశాల వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో నిందితులుగా చేర్చడంపై పుష్ప నిర్మాతలు హైకోర్టును ఆశ్రయించారు. మైత్రి మూవీస్ నిర్మాతలు యలమంచిలి రవిశంకర్, యర్నేని నవీన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై ఈరోజు (గురువారం) హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ కేసులో తమ ప్రమేయం లేదని.. కేసును కొట్టేయాలని నిర్మాతలు కోరారు. పుష్ప 2తో సహా 30 ఇతర సినిమాలను నిర్మించామని పిటిషినర్లు తెలిపారు. సంధ్య థియేటర్ ప్రమాదంతో తమకు ఎలాంటి సంబంధం లేదని వాదనలు వినిపించారు.


నిర్మాతలైనంత మాత్రాన ఘటనకు బాధ్యులను చేస్తూ క్రిమినల్ కేసు నమోదు చేయడం చట్టవిరుద్ధమన్నారు. తమ నమోదైన ఎఫ్‌ఐఆర్ కొట్టివేయాలి హైకోర్టును నిర్మాతలు కోరారు. వాదనలు విన్న హైకోర్టు నాట్ టు అరెస్ట్ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఏ 18గా సినిమా నిర్మాతలను పోలీసులు చేర్చిన విషయం తెలిసిందే. దీంతో వీరు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు నిర్మాతలు అరెస్ట్ చేయవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన ఘటనకు ప్రొడ్యూసర్లకు ఎలాంటి సంబంధం లేదని పిటిషనర్ల తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. పైగా ఈ ఘటనపై పిటిషనర్లే పోలీసులకు సమాచారం ఇచ్చారని తెలిపారు. అయితే సంధ్య థియేటర్ వద్ద అనుకోని ఘటన జరగడంతో తమను నిందితులుగా చేర్చారని చెప్పారు. వాదనలు విన్న న్యాయస్థానం నిర్మాతలను అరెస్ట్ చేయవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.


ఇవి కూడా చదవండి...

ఏపీ క్యాబినెట్ భేటీ.. నిర్ణయాలు ఇవే..

నేటి బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయంటే

Read Latest Telangana News And Telugu news

Updated Date - Jan 02 , 2025 | 12:43 PM