HCU Land: ఈ ప్రభుత్వానికి కనికరం లేదు
ABN , Publish Date - Mar 31 , 2025 | 08:43 PM
HCU Land: కంచ గచ్చిబౌలిలోని 400 భూమిని వేలం వేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతా వేదికగా కిషన్ రెడ్డి స్పందించారు.

హైదరాబాద్, మార్చి 31: హైదరాబాద్ కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూములు వేలం వేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయించడంపై కేంద్ర బోగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి సోమవారం తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్లక్ష్య చర్యను తాను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. పర్యావరణ విధ్వంసాన్ని వెంటనే ఆపాలని రేవంత్ ప్రభుత్వానికి ఈ సందర్భంగా ఆయన సూచించారు. హైదరాబాద్ పర్యావరణానికి ఇతోధికంగా తోడ్పాటును అందిస్తున్న ఈ ప్రదేశాలను రక్షించాలని సీఎం రేవంత్ రెడ్డిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. ఈ 400 ఎకరాల భూమిని వేలం వేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన క్రూరమైన చర్యగా అభివర్ణించారు.
ప్రతిపక్షాల గొంతు నొక్కడం..విద్యార్థులను అణచివేయడం.. చెట్లను నరికివేయడంతోపాటు పచ్చదనం, జీవవైవిధ్యాన్ని నాశనం చేయడం దారుణమని ఆయన పేర్కొన్నారు. నిధుల సమీకరణ కోసం ఈ తరహా చర్యలు చేపట్టడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ తరహా చర్యలను తెలంగాణలో కనికరం లేని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కంచ గచ్చిబౌలిలోని వందలాది ఎకరాల భూమిని ఈ ప్రభుత్వం వేలం వేయడం ద్వారా ఆ ప్రాంతంలోని గొప్ప వృక్షజాలంతోపాటు జంతుజాలాన్ని నిర్లక్ష్యంగా తుడిచిపెట్టుకు పోవడం ఖాయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మన జాతీయ పక్షులు - నెమళ్ళు అర్ధరాత్రి ఈ ప్రాంత జీవవైవిధ్యాన్ని నాశనం చేస్తున్నప్పుడు వాటి కేకలు వినడం హృదయ విదారకంగా ఉందన్నారు. హెచ్‌సియు వంటి ప్రఖ్యాత సంస్థలను ఆక్రమించుకుంటూనే..విద్యార్థుల గొంతులను దారుణంగా నొక్కేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఇదే అంశంపై సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి నాలుగు రోజుల క్రితం లేఖ రాసిన విషయం విదితమే.
మరోవైపు ఇదే వ్యవహారంపై హెచ్‌సీయూ విద్యార్థులు సోమవారం తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆ విద్యార్థులకు కేటీఆర్ సంఘిభావం తెలిపారు. అనంతరం కేటీఆర్ విలేకర్లతో మాట్లాడుతూ.. ఈ భూమల పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు.
ఈ వార్తలు కూడా చదవండి..
KTR: అప్పుడే సీఎం రేవంత్ రెడ్డి కన్ను పడింది
Pidakala Samaram: మొదలైన పిడకల సమరం.. ఎక్కడంటే..
Maoists: వచ్చే ఏడాది సరిగ్గా.. లక్ష్యం దిశగా ఆపరేషన్ కగార్
Liquor Shops: ఏప్రిల్ 1 నుంచి మద్యం షాపులు బంద్.. ఎందుకంటే..
Ranya Rao: వెలుగులోకి సంచలన విషయాలు..
Also Read: తొక్కే కదా అని పారేస్తున్నారా.. దీనిలోని పోషకాలు తెలిస్తే.. ఆశ్చర్యపోతారు..
Sanjay Raut: మోదీ ఆ ప్లాన్‌తోనే ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వెళ్లారేమో..