Share News

CM Chandrababu: హైదరాబాద్‌కు వస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు..

ABN , Publish Date - Jan 03 , 2025 | 07:31 AM

హైదరాబాద్‌: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం హైదరాబాద్‌కు రానున్నారు. ప్రపంచ తెలుగు మహాసభల సమాఖ్య సమావేశాల్లో ఆయన పాల్గొననున్నారు. ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక అంతర్జాతీయ తెలుగు మహాసభలను ఈసారి హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు.

CM Chandrababu: హైదరాబాద్‌కు వస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు..
AP CM Chandrababu Naidu

హైదరాబాద్‌: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) శుక్రవారం హైదరాబాద్‌ (Hyderabad)కు రానున్నారు. ప్రపంచ తెలుగు మహాసభల సమాఖ్య సమావేశాల్లో (World Telugu Federation Meetings) ఆయన పాల్గొననున్నారు. ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక అంతర్జాతీయ తెలుగు మహాసభలను ఈసారి హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు. శుక్రవారం నుంచి 5వ తేదీ వరకు హెచ్‌‌ఐసిసి నోవాటెల్‌ (HICC Novatel)లో జరగనున్నాయి. ఈ మహాసభలు తెలుగుదనం వెల్లివిరిసేలా జరుగుతాయి. వివిధ రంగాలకు చెందిన ఎంతోమంది తెలుగు ప్రముఖులు ఈ మహాసభలకు హాజరవుతున్నారు. రాజకీయ నాయకులు, సినీకళాకారులు, సాహితీవేత్తలు, వ్యాపార ప్రముఖులు, ఇతర రంగాలకు చెందినవారు కూడా ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. అంగరంగ వైభవంగా జరిగే ఈ మహాసభల్లో పాల్గొనేందుకు ఇప్పటికే పలువురు ప్రముఖులు సంసిద్ధత వ్యక్తం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రులతోపాటు బిజినెస్‌ రంగానికి చెందిన పలువురు తెలుగు ప్రముఖులు కూడా ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. బిజినెస్‌ సదస్సులు, మహిళా సదస్సులు, కల్చరల్‌ ప్రోగ్రామ్స్‌ కూడా ఈ మహాసభల్లో కనువిందు చేయనున్నాయి. రామ్‌ మిర్యాలతో సంగీత విభావరి ఉర్రూతలూగించనున్నది. అలాగే తెలుగుదనం కనిపించేలా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ మహాసభలకు సినిమారంగం నుంచి చిరంజీవి, బాలకృష్ణ, జయసుధ, జయప్రద, మురళీ మోహన్‌ తదితరులు వస్తుండటంతో అభిమానులకు కూడా పండగేనని చెప్పవచ్చు. ఈ మహాసభలకు అందరూ తరలివచ్చి విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు.


శుక్రవారం జరిగే ప్రారంభ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. జనవరి 5వ తేదీన జరిగే ముగింపు వేడుకలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వస్తున్నారని ప్రపంచ తెలుగు సమాఖ్య అధ్యక్షురాలు ఇందిరాదత్‌ తెలిపారు. ప్రముఖ తెలుగు పారిశ్రామికవేత్తలను, ఇతర రంగాలకు చెందిన కొందరు తెలుగు ప్రముఖులను కూడా ఆహ్వానించి సత్కరించనున్నారు. ఈ ద్వైవార్షిక అంతర్జాతీయ మహాసభల్లో ప్రపంచ తెలుగు సమాఖ్య అనుబంధ సంస్థల ప్రతినిధుల సమావేశం, వాణిజ్య, పారిశ్రామిక వేత్తల సదస్సులు కూడా ఏర్పాటు చేశారు. సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా జానపద కళారూపాల ప్రదర్శన, కూచిపూడి నృత్య రూపకాలు, సాహితీ రూపకములు, భాషా, సంస్కృతులపై ప్రముఖుల ప్రసంగాలు, సినీ కళాకారుల ప్రదర్శనలు, సినీసంగీత విభావరి, తెలుగువారి చేనేత వస్త్ర అందాల ప్రదర్శనలతో పాటు మరికొన్ని ఆసక్తికర కార్యక్రమాలు ఉంటా యని నిర్వాహకులు పేర్కొన్నారు. యునికార్న్‌ కంపెనీలు స్టార్టప్‌ కంపెనీలు కూడా ఇందులో పాల్గొంటున్నాయి. విదేశాల్లో ఉన్న తెలుగు సంఘాల నాయకులు కూడా ఈ మహాసభల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌ వస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వైజాగ్, విజయవాడకు డబుల్ డెక్కర్ మెట్రో..

450 కోట్ల స్కామ్‌లో టీమిండియా స్టార్

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jan 03 , 2025 | 07:51 AM