CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో మరో కీలక ముందడుగు

ABN, Publish Date - Jan 23 , 2025 | 09:35 AM

దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికపై తెలంగాణ కొత్త రికార్డు నమోదు చేసింది. హైదరాబాద్‌లో విప్రో సంస్థ విస్తరణకు అంగీకారం కుదిరింది. గోపనపల్లి క్యాంపస్‌లో కొత్త ఐటీ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. దీంతో 5 వేల మందికి ప్రత్యక్షంగా.. పరోక్షంగా ఉద్యోగాలు వచ్చే అవకాశముంది.

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి దావోస్  పర్యటనలో మరో కీలక ముందడుగు

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దావోస్ (Davos) పర్యటనలో మరో కీలక అడుగు (Another key step) ముందుకు పడింది. హైదరాబాద్‌లో విప్రో సంస్థ విస్తరణకు (Wipro Company Expansion) అంగీకారం కుదిరింది. గోపనపల్లి క్యాంపస్‌లో కొత్త ఐటీ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. దీంతో 5 వేల మందికి ప్రత్యక్షంగా.. పరోక్షంగా ఉద్యోగాలు వచ్చే అవకాశముంది. దావోస్‌లో సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ సమావేశం అయ్యారు. భేటీ అనంతరం విప్రో విస్తరణపై కీలక ప్రకటన విడుదల చేశారు. రాబోయే రెండు మూడేండ్లలో కొత్త ఐటీ సెంటర్ పూర్తి కానుంది. విప్రో విస్తరణ ప్రణాళికను సీఎం రేవంత్ రెడ్డి స్వాగతించారు. విప్రో లాంటి సంస్థలకు తగిన మద్దతు ఇచ్చేందుకు వ్యాపారాలకు అనువైన వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఇప్పటికే దావోస్ పర్యటనలో 70 వేల కోట్లకు పైగా పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. తెలంగాణాకు పెట్టుబడుల ఒప్పందాలపై ప్రభుత్వ వర్గాల హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

కాగా దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికపై తెలంగాణ కొత్త రికార్డు నమోదు చేసింది. గతంలో ఎన్నడూ లేనంతగా.. ఒకేరోజు రూ.56,300 కోట్ల పెట్టుబడులకు సంబంధించి దిగ్గజ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. వాటిలో ముఖ్యమైనది.. ఇంధన రంగంలో దేశంలోనే పేరొందిన సన్‌ పెట్రో కెమికల్స్‌ సంస్థ రాష్ట్రంలో భారీ పంప్డ్‌ స్టోరేజీ జలవిద్యుత్తు, సౌర విద్యుత్తు ప్రాజెక్టుల ఏర్పాటుకు చేసుకున్న రూ.45,500 కోట్ల ఒప్పందం. సన్‌ పెట్రో కెమికల్స్‌ ఎండీ దిలీప్‌ సాంఘ్వీతో సీఎం రేవంత్‌ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు బుధవారం సమావేశమయ్యారు. అనంతరం కంపెనీ కొత్త పెట్టుబడులు ప్రకటించింది. సీఎం రేవంత్‌ సమక్షంలో దావోస్‌ సదస్సులో రాష్ట్రప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలోని నాగర్‌ కర్నూలు, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో మూడు చోట్ల పంప్డ్‌ స్టోరేజీ హైడ్రో పవర్‌ ప్రాజెక్టులను నెలకొల్పుతామని కంపెనీ ప్రకటించింది. ఈ మూడు ప్రాజెక్టుల మొత్తం ఇంధన సామర్థ్యం 3400 మెగావాట్లు. వీటికి 5440 మెగావాట్ల సామర్థ్యం ఉండే సౌర విద్యుత్తు ప్లాంట్లను అనుసంధానం చేస్తుంది.

ఈ వార్త కూడా చదవండి

చంద్రబాబుతో భేటీలో బిల్ గేట్స్ రియాక్షన్..


ఈ ప్రాజెక్టుల నిర్మాణ దశలోనే దాదాపు 7 వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయని కంపెనీ తెలిపింది. తెలంగాణ ఆవిర్భావం అనంతరం నుంచి ఇప్పటివరకు దావోస్‌ వేదికపై తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న భారీ ఒప్పందం ఇదే కావడం విశేషం. కాగా.. సుస్థిరమైన ఇంధన వృద్థి సాధించాలన్న తెలంగాణ లక్ష్య సాధనలో ఈ ఒప్పందం మైలురాయిగా నిలుస్తుందని సీఎం రేవంత్‌ అన్నారు. ఈ ఒక్క ఒప్పందంతో తెలంగాణ రైజింగ్‌ ప్రతినిధి బృందం.. నిరుడు దావోస్‌లో సాధించిన రూ.40 వేల కోట్ల పెట్టుబడుల రికార్డును సమం చేసిందన్నారు. భవిష్యత్తు ఇంధన అవసరాల దృష్ట్యా క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ ఎనర్జీకి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని చెప్పారు. ఈ ఒప్పందంతో రాష్ట్ర యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు రావడంతోపాటు నాగర్‌కర్నూల్‌, మంచిర్యాల, ములుగు జిల్లాలు పారిశ్రామికంగా వృద్ధి చెందుతాయన్నారు.

400 మెగావాట్ల సామర్థ్యంతో..

తెలంగాణలో రూ.10 కోట్ల పెట్టుబడితో కృత్రిమమేధ డేటాసెంటర్‌ క్లస్టర్‌ను నెలకొల్పేందుకు.. కంట్రోల్‌ ఎస్‌ డేటా సెంటర్స్‌ లిమిటెడ్‌ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. 400 మెగా వాట్ల సామర్థ్యంతో ఈ డేటా సెంటర్‌ నెలకొల్పుతామని ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్‌తో దాదాపు 3,600 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయని ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో డిజిటల్‌ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఈ డేటా సెంటర్‌ ఏర్పాటు మరో మైలురాయి గా నిలుస్తుందని మంత్రి శ్రీధర్‌ బాబు అన్నారు. ఈ ఒప్పందంతో ఐటీ సేవల సామర్థ్యం పెరుగుతుంద ని, ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయని పేర్కొన్నారు. డేటా సెంటర్ల ఏర్పాటుతో తెలంగాణలో ఐటీ సేవల ప్రమాణాలు మరింత వృద్ధి సాధిస్తాయని కంట్రోల్‌ ఎస్‌ సీఈవో శ్రీధర్‌ పిన్నపురెడ్డి అన్నారు. అమెరికా కేంద్రంగా రక్షణ రంగంలో వివిధ ఉత్పత్తులు తయారుచేసే ప్రముఖ కంపెనీ జేఎ్‌సడబ్ల్యూ.. రాష్ట్రంలో రూ. 800 కోట్ల పెట్టుబడులు పెడతామని.. అధునాతన అన్‌మాన్డ్‌ ఏరియల్‌ సిస్టమ్స్‌ (యూఏవీ) తయారీ యూనిట్‌ ఏర్పాటుచేస్తామని ప్రకటించింది.


అలాగే చెన్నైలో ప్రారంభమై ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన దిగ్గజ ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్‌.. హైదరాబాద్‌లో కొత్త టెక్‌ సెంటర్‌ను ప్రారంభించనుంది. హెచ్‌సీఎల్‌ టెక్‌ గ్లోబల్‌ సీఈవో, ఎండీ సి.విజయకుమార్‌తో సీఎం రేవంత్‌ చర్చల అనంతరం కంపెనీ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ ఒప్పందంలో భాగంగా అత్యాధునిక క్లౌడ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ సొల్యూషన్‌లకు సంబంధించి కొత్త సెంటర్‌ ఏర్పాటు చేయనుంది. హైటెక్‌ సిటీలో 3.2 లక్షల చదరపుటడుగుల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటుచేస్తామని, దీంతో దాదాపు 5వేల మంది ఐటీనిపుణులకు ఉద్యోగాలు లభిస్తాయని కంపెనీ తెలిపింది. కాగా.. ప్రపంచస్థాయి వసతులతో కొత్త కేంద్రాన్ని ఏర్పాటుచేస్తామని సీఈవో విజయ్‌ కుమార్‌ తెలిపారు. తాజా నిర్ణయంతో నగరంలో హెచ్‌సీఎల్‌ కేంద్రాల సంఖ్య ఐదుకు పెరగనుంది.

ప్రపంచంలోనే అత్యుత్తమ మొబిలిటీ అవకాశా లు హైదరాబాద్‌లో ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. విద్యుత్తు వాహనాలపై తాము ప్రత్యేకంగా దృష్టి సారించామని.. ఆ వాహనాలపై రోడ్‌ ట్యాక్స్‌, రిజిస్ట్రేషన్‌ చార్జీలు రద్దు చేశామని వివరించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో ప్రజారవాణా వ్యవస్థలో 3 వేల విద్యుత్‌ బస్సులను ప్రవేశపెడుతున్నట్టు చెప్పారు. అనంతరం నిర్వహించిన మరో సమావేశంలో.. ట్రిలియన్‌ మొక్కలు నాటడమే లక్ష్యంగా ఏర్పడిన ‘ట్రిలియన్‌ ట్రీ ఉద్యమానికి సీఎం మద్దతు తెలిపారు. ఇందులో భాగస్వామిని అవుతానంటూ ప్రమాణం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

టాలీవుడ్ నిర్మాతల ఆస్తులను పరిశీలిస్తున్నఐటీ

గన్నవరం ఎయిర్‌పోర్టుకు రావలసిన పలు విమానాలు ఆలస్యం

అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయండి

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jan 23 , 2025 | 09:35 AM