Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన.. షెడ్యూల్ ఇదే..
ABN, Publish Date - Jan 15 , 2025 | 09:52 AM
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్న సంగతి తెలిసిందే. రెండ్రోజుల పాటు ఆయన ఢిల్లీలో బిజిబిజీగా గడపనున్నారు.బుధవారం జరిగే ఏఐసీసీ కార్యాలయం ప్రారంభోత్సవంలో రేవంత్ రెడ్డి సహా.. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పలువురు మంత్రులు, కీలక నేతలు పాల్గొంటారు. ఈ కార్యక్రమం తర్వాత పార్టీ అధిష్ఠానంతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అవుతారు.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ (Delhi)కి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేరుకున్నారు. బుధవారం జరిగే ఏఐసీసీ (AICC) నూతన కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఢిల్లీకి వెళ్లారు. గురు, శుక్రవారం రెండ్రోజులపాటు ఢిల్లీలోనే ఉంటారు. అనంతరం విదేశీ పర్యటనకు బయలుదేరి వెళతారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం నేపథ్యంలో ఇప్పటికే పెద్దఎత్తున దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ అగ్రనేతలు ఢిల్లీకి చేరుకున్నారు. ఏపీ పీసీసీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిలా సయితం ఇప్పటికే చేరుకున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో ఆమె భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. కాగా రేవంత్ రెడ్డి కుటుంబసమేతంగా ఢిల్లీకి చేరుకున్నారు. బుధవారం ఉదయం 10:30 గంటలకు జరిగే కార్యక్రమానికి ఆయన హాజరవుతారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు ఉన్నారు.
ఈ వార్త కూడా చదవండి..
అమరావతి కౌలు రైతులకు సీఎం చంద్రబాబు శుభవార్త
ఏఐసీసీ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం కాంగ్రెస్ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ, టీపీసీసీ కార్యవర్గం కూర్పు, నామినేటెడ్ పదవుల భర్తీ వంటి అంశాలపై వారితో చర్చించనున్నారు. అలాగే పలువురు కేంద్ర మంత్రులను సీఎం కలవనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి వారితో మాట్లాడనున్నారు. కేంద్రమంత్రులను కలిసే సమయంలో సీఎం వెంట ఆయా శాఖల రాష్ట్ర మంత్రులు ఉంటారు. అనంతరం గురువారం రాత్రి ఢిల్లీ నుంచి సింగపూర్ పర్యటనకు రేవంత్ రెడ్డి వెళతారు. సింగపూర్‌కు చేరుకున్న తర్వాత రేవంత్ బృందం శుక్రవారం అక్కడ జరిగే బిజినెస్ మీట్‌లో పాల్గొంటారు. పలువురు పారిశ్రామిక వేత్తలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అవుతారు.
అనంతరం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే స్పోర్ట్స్ యూనివర్శిటీకి సంబంధించి సింగపూర్‌లో ఉన్న స్పోర్ట్స్ యూనివర్శిటీని సందర్శిస్తారు. ఆ యూనివర్శిటీకి సంబంధించి పలు విషయాలను తెలుసుకోనున్నారు. అలాగే షాపింగ్ మాల్స్, స్టేడియాల నిర్మాణాలను పరిశీలించే అవకాశం ఉంది. జనవరి 19న సింగపూర్ నుంచి స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కు సీఎం రేవంత్ రెడ్డి వెళతారు. 20, 21, 22 తేదీల్లో అక్కడ నిర్వహించే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో పాల్గొని తెలంగాణకు పెద్దఎత్తున పెట్టుబడులు తీసుకువచ్చే ప్రయత్నం చేయనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలుగు ప్రజలకు సీఎం చంద్రబాబు కనుమ శుభాకాంక్షలు..
కేటీఆర్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ
శ్రీవారి దర్శన టోకెన్ల జారీ.. వాళ్లకు మాత్రమే..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Jan 15 , 2025 | 10:00 AM