Share News

CM Revanth Reddy: దావోస్ టూర్ సక్సెస్.. స్వరాష్ట్రానికి సీఎం రేవంత్

ABN , Publish Date - Jan 24 , 2025 | 09:19 AM

CM Revanth: దావోస్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డికి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యేలు మల్రెడ్డి, దానం నాగేందర్, ఈర్లపల్లి శంకర్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కలిసి ముఖ్యమంత్రికి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు.

CM Revanth Reddy: దావోస్ టూర్ సక్సెస్.. స్వరాష్ట్రానికి సీఎం రేవంత్
CM Revanth Reddy

హైదరాబాద్, జనవరి 24: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy) హైదరాబాద్‌కు (Hyderabad) చేరుకున్నారు. నాలుగు రోజుల దావోస్ పర్యటనను విజయవంతంగా ముగించుకొని సీఎం రేవంత్‌తో తెలంగాణ రైసింగ్ బృందం హైదరాబాద్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా సీఎంకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కీలక నేతలు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యేలు మల్రెడ్డి రాంరెడ్డి, దానం నాగేందర్, ఈర్లపల్లి శంకర్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు కలిసి ముఖ్యమంత్రికి గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పారు.


భారీ పెట్టుబడులను ఆకర్షించి, కీలకమైన ఒప్పందాలు చేసుకుని, అంతర్జాతీయ దిగ్గజ సంస్థలను తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆకర్షించి రాష్ట్రానికి వచ్చిన రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందానికి కాంగ్రెస్ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా దావోస్‌కు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు. వివిధ దిగ్గజ కంపెనీలతో భేటీ అయి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా ఒప్పందాలు కుదర్చుకుంది తెలంగాణ ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో అనేక ప్రముఖ కంపెనీల అధినేతలు రాష్ట్రంలో పెట్టుబుడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు. దాదాపు 20 కంపెనీలు రాష్ట్రంలో ఆయా సంస్థలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకున్నాయి. దిగ్గజ కంపెనీలతో 1.78 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూ కుదర్చుకుంది తెలంగాణ సర్కార్. ఈ కంపెనీల రాకతో వేలల్లో ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది.

CM Revanth Reddy

సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్.. షెడ్యూల్ ఇదే..


గతంలో ఎన్నడూ లేని విధంగా దావోస్ పర్యటనలో భారీ పెట్టుబడులను తెలంగాణ సర్కార్ ఆకర్షించింది. ఈ నాలుగు రోజుల పర్యటనలో అంతర్జాతీయ దిగ్గజ సంస్థలతో 1.78 లక్షల కోట్ల పెట్టుబడులను కుదర్చుకుంది. అంతర్జాతీయ దిగ్గజ సంస్థ అయిన అమేజాన్ 60వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ సర్కార్‌తో ఒప్పందం కుదర్చుకుంది. దాంతో పాటు మరో కీలక సంస్థ సన్‌పెట్రో కెమికల్స్ సంస్థ రూ. 45,500 కోట్ల పెట్టుబడులు, కంట్రోల్ ఎస్ (CtrlS)రూ. 10,000 కోట్లు, జేఎస్ డబ్ల్యూ సంస్థ రూ.800 కోట్ల పెట్టుబడులు, స్కైరూట్ ఏరో స్పేస్‌ రూ.500 కోట్ల పెట్టుబడులు, మేఘా ఇంజనీరింగ్ (MEIL) రూ.15000 కోట్ల పెట్టుబడులు, ఇన్ఫోసిస్ రూ.750 కోట్ల పెట్టుబడులు ఇలా అనేక అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి.


అందుకు సంబంధించి తెలంగాణ సర్కార్‌తో ఆయా సంస్థలు కీలక ఒప్పందాలు చేసుకున్నాయి. దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ సదస్సులో అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తలతో రేవంత్ నేతృత్వంలోని రైజింగ్ బృందం విస్తృతంగా చర్చలు జరిపింది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఏ విధంగా అనుకూలమైన వాతవారణం ఉంది, పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏవిధమైన పాలసీలు తీసుకువచ్చింది, కొత్తగా తీసుకొచ్చిన గ్రీన్ ఎనర్జీ పాలసీపై, ఎలక్ట్రిక్ వాహనాలకు ట్యాక్స్‌ ఎక్సెంప్షన్, ఐటీ పెట్టుబడుల పెట్టుబడులను పెట్టేందుకు తెలంగాణ సర్కార్ అందించే ప్రోత్సహకాల గురించి సమగ్రంగా ఆయా దిగ్గజ కంపెనీలకు తెలియజేసింది తెలంగాణ రైజింగ్ బృందం. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించడంలో రేవంత్ నేతృత్వంలోని రైజింగ్‌ బృందం సక్సెస్ అయ్యింది.


ఇవి కూడా చదవండి..

Tiger Attack: ఆ జిల్లా ప్రజలను వణికిస్తున్న పెద్దపులి.. బయటకు రావొద్దని హెచ్చరికలు..

నాలా ద్వారా ఇంట్లోకి దూసుకొస్తున్న కొండచిలువ..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 24 , 2025 | 10:24 AM