Kancha Gachibowli Land: కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సర్కార్ సీరియస్.. చర్యలకు రంగం సిద్ధం..
ABN , Publish Date - Apr 04 , 2025 | 08:05 PM
కంచ గచ్చిబౌలి భూములపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తాము అధికారంలోకి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మిన భూములను వెనక్కి తీసుకుంటామని కేటీఆర్ అనడంపై సీరియస్ అయ్యింది.

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ భూములు ఎవ్వరూ కొనొద్దంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సర్కార్ (Congress government) సీరియస్ అయ్యింది. బీఆర్ఎస్(BRS) అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద కొనుగోలు చేసిన భూములను తిరిగి తీసుకుంటామని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. కేటీఆర్ వ్యాఖ్యలపై రేవంత్ సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ మేరకు గత బీఆర్ఎస్ సర్కార్‍లో అమ్మిన ప్రభుత్వ భూముల వివరాలను ఆరా తీస్తోంది. ఎన్ని ఎకరాలను అమ్మారు?, ఎంత నగదు సేకరించారనే లెక్కలు తీస్తోంది. ఆ భూముల్లో నరికిన చెట్లు, నిబంధనల ఉల్లంఘన వంటి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం వద్ద భూములు కొనుగోలు చేసిన వారికి నోటీసులు సైతం ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కంచ గచ్చిబౌలి భూములకు టైటిల్ ఇచ్చే విషయంపైనా పునరాలోచనలో పడినట్లు సమాచారం. అలాగే ఆ భూముల్లో ఎకో పార్క్, వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేసే యోచనలో రేవంత్ రెడ్డి సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది.
వన్యప్రాణులున్న భూముల్లో నిర్మాణాలు చేపట్టవద్దని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పర్యావరణవేత్తలు, విద్యార్థులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీని ఫోర్త్ సిటీకి తరలించాలని ప్రభుత్వం భావిస్తోంది. అనంతరం ఆ ప్రదేశంలో వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, ఎకో పార్క్ నిర్మాణం దిశగా ప్రభుత్వవర్గాలు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
Toothbrush: టూత్ బ్రష్ వాడుతున్నారా.. ఇవి తెలుసుకోకపోతే అంతే సంగతులు..
Kazakhstan: చర్చనీయాంశంగా మారిన కజకిస్తాన్ దేశం.. అక్కడ దొరికింది చూస్తే..
Vijaya Dairy Price Revision: పాడి రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన విజయ డెయిరీ..