Share News

Fire Accident: పార్క్‌ హయత్‌లో అగ్నిప్రమాదం.. అక్కడే సన్‌రైజర్స్‌ టీం

ABN , Publish Date - Apr 14 , 2025 | 01:08 PM

Fire Accident: నగరంలోని పార్క్‌ హయత్‌ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

Fire Accident: పార్క్‌ హయత్‌లో అగ్నిప్రమాదం.. అక్కడే సన్‌రైజర్స్‌ టీం
Fire Accident At Park Hyatt Hotel

హైదరాబాద్, ఏప్రిల్ 14: వేసవి కాలంలో అగ్నిప్రమాదాలు తరచుగా సంభవిస్తూ ఉంటాయి. ఇటీవల కాలంలో నగరంలో పలు అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. వరుస అగ్నిప్రమాదాలతో నగరం ఉలిక్కిపడుతోంది. ఇప్పుడు తాజాగా ఓ ప్రముఖ హోటల్‌లో మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో హోటల్‌ సిబ్బంది వెంటనే అప్రమత్తమైంది. అయితే ఇదే హోటల్‌లో హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌ టీం (Hyderabad Sunrisers Team) కూడా బస చేయడంతో ఒకింత ఆందోళన నెలకొంది. ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.


నగరంలోని బంజారాహిల్స్ పార్క్‌హయత్‌‌లో ఈరోజు (సోమవారం) ఫైర్ యాక్సిడెంట్ (Fire Accident) జరిగింది. పార్క్‌హయత్‌లోని మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగలు అలముకున్నాయి. వెంటనే అప్రమత్తమైన హోటల్ సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న ఫైర్ సిబ్బంది త్వరితగతిన మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు. అయితే ప్రమాదం ఎలా జరిగింది... మంటలు ఏ విధంగా అంటుకున్నాయి అనే వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది. అయితే పార్క్‌హయత్‌ హోటల్‌లోనే హైదరాబాద్ సన్‌రైజర్ టీం బస చేస్తోంది. ఈ హోటల్‌లోనే ప్రమాదం జరగడంతో అభిమానులు ఒకింత భయాందోళనకు గురయ్యారు. కానీ సన్‌రైజర్ టీంకు ఎలాంటి ప్రమాదం జరగలేదని.. ప్లేయర్లు అంతా సేఫ్‌గా ఉన్నారని హోటల్ సిబ్బంది తెలపడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.


ఇవి కూడా చదవండి

Falaknuma Crime News: వివాహమైన మూడు రోజులకే రౌడీషీటర్ దారుణ హత్య.. ఏం జరిగిందంటే

CM Revanth Praised Women: సన్నబియ్యంతో సహపంక్తి భోజనం.. మహిళకు సీఎం అభినందనలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 14 , 2025 | 01:40 PM