Formula E Case: ఏసీబీ విచారణకు బీఎల్‌ఎన్ రెడ్డి
ABN, Publish Date - Jan 10 , 2025 | 11:34 AM
Formula E Case: ఏసీబీ ముందు విచారణకు హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎన్‌ఎల్ రెడ్డి హాజరయ్యారు. ఫ్ఈఓకు జరిగిన చెల్లింపులపై బీఎల్ఎన్ రెడ్డి ప్రొసీడింగ్స్ పూర్తి చేశారు. అయితే ఎవరి ఆదేశాలతో ప్రొసీడింగ్స్ పూర్తిచేసి నగదు రిలీజ్ చేశారని ఆయను ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
హైదరాబాద్, జనవరి 10: ఫార్ములా ఈకార్ రేసు కేసులో (Formula E Car Race Case) హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డిని (HMDA Formre Chief engineer BLN Reddy) ఏసీబీ (ACB) అధికారులు విచారిస్తున్నారు. హెచ్ఎండీఏ బోర్డు ఖాతా నుండి నగదు రిలీజ్ చేయడంలో బీఎల్ఎన్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. ఎఫ్ఈఓకు జరిగిన చెల్లింపులపై బీఎల్ఎన్ రెడ్డి ప్రొసీడింగ్స్ పూర్తి చేశారు. అయితే ఎవరి ఆదేశాలతో ప్రొసీడింగ్స్ పూర్తి చేసి నగదు రిలీజ్ చేశారని ఆయనను ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. హెచ్ఎండీఏ బోర్డు నుంచి బదిలీ అయిన రూ. 45.75 కోట్లపై ఏసీబీ ప్రశ్నిస్తోంది. అలాగే ఫెనాల్టీ కింద ఐటీ శాఖకు చెల్లించిన రూ. 8 కోట్లపై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. బీఎల్‌ఎన్ రెడ్డి చేసిన ప్రొసీడింగ్స్ పత్రాలను ముందు పెట్టి మరీ ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు. కాగా.. హెచ్‌ఎండీఏ బోర్డు నుంచి రూ.55 కోట్లు రిలీజ్ చేయడంలో బీఎన్‌ఎల్ రెడ్డి పాత్ర చాలా కీలకమని ఏసీబీ గుర్తించింది.
ఇప్పటికే ప్రొసీడింగ్స్ అన్నీ కూడా బీఎన్‌ఎల్ రెడ్డి పూర్తి చేయడంతో హెచ్‌ఎండీఏ నిధులు రిలీజ్ అయి ఎఫ్‌ఈవో కంపెనీకి చెల్లింపులు జరిగాయి. వీటిపైన పూర్తి స్థాయిలో ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు. ఇప్పటికే బీఎన్‌ఎల్ రెడ్డిని ఈడీ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. ఈడీ విచారణ అనంతరం ఈరోజు వ్యక్తిగతంగా ఏసీబీ కార్యాలయం ముందు విచారణకు బీఎన్‌ఎల్ రెడ్డి హాజరయ్యారు. ఎఫ్‌ఈవోతో చేసిన ఒప్పందాలు, హెచ్‌ఎండీఏ నుంచి బదిలీ అయిన నగదు గురించి సుదీర్ఘంగా విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అప్పటి మంత్రి కేటీఆర్ (Former Minister KTR) ఆదేశాలతో ప్రొసీడింగ్స్ పూర్తి చేసి నగదును రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు హెచ్ఎండీఏ నుంచి సేకరించిన పత్రాలను ముందు పెట్టి మరీ బీఎన్‌ఎల్ రెడ్డిని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. మరోవైపు ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ నుంచి రికార్డులను పరిశీలించిన ఏసీబీ.. ఆ రికార్డులను బీఎన్‌ఎల్ రెడ్డి ముందు ఉంచి విచారణ జరుపుతున్నారు.
ఇదే కేసులో ఏ2గా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌ను, ఏ1గా ఉన్న కేటీఆర్‌ను ఏసీబీ ఇప్పటికే విచారించింది. వీరిద్దరి స్టేట్‌మెంట్లను అధికారులు రికార్డు చేశారు. అలాగే ఈరోజు బీఎన్‌ఎల్ రెడ్డి స్టేట్‌మెంట్‌ను కూడా రికార్డు చేయనున్నారు. ఈరోజు సాయంత్రం వరకు విచారణ కొనసాగనుంది. మరోసారి కూడా బీఎన్‌ఎల్ రెడ్డి విచారణకు రావాల్సిందిగా ఆదేశించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి...
లాస్ ఏంజెలెస్ కార్చిచ్చు.. నష్టం 5 లక్షల కోట్లు
Read Latest Telangana News And Telugu News
Updated Date - Jan 10 , 2025 | 11:47 AM