ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Formula E car case: ఏసీబీ విచారణకు కేటీఆర్.. ఏం జరుగనుంది.. తీవ్ర ఉత్కంఠ

ABN, Publish Date - Jan 09 , 2025 | 10:28 AM

Telangana: ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో కేటీఆర్‌ను ప్రధాన నిందితుడిగా పేర్కొన్న ఏసీబీ.. ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనుంది. కేటీఆర్ విచారణ కనిపించే అంత దూరం వరకు న్యాయవాదిని అనుమతించాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇన్వెస్టిగేషన్ రూమ్‌లో కేటీఆర్‌ను, న్యాయవాదిని లైబ్రరీలో కూర్చోబెట్టేందుకు ఏసీబీ ఏర్పాట్లు చేసింది.

Formula E Race Case

హైదరాబాద్, జనవరి 9: ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో (Formula E Car Race Case) మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (Former Minister KTR).. ఏసీబీ విచారణకు హాజరయ్యారు. గురువారం ఉదయం ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్ వచ్చారు. ఫార్ములా ఈ కేసులో నిధుల మళ్లింపుపై కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు ప్రశ్నించనున్నారు. కేటీఆర్‌ను ముగ్గురు అధికారులు ప్రశ్నిస్తున్నారు. అరవింద్ కుమార్, దానకిషోర్ ఇచ్చిన స్టేట్‌మెంట్స్‌ ఆధారంగా విచారణ జరుగుతోంది. కేటీఆర్‌ వెంట న్యాయవాది రామచంద్రరావు ఏసీబీ కార్యాలయానికి వచ్చారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో కేటీఆర్‌ను ప్రధాన నిందితుడిగా పేర్కొన్న ఏసీబీ.. ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనుంది. కేటీఆర్ విచారణ కనిపించే అంత దూరం వరకు న్యాయవాదిని అనుమతించాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇన్వెస్టిగేషన్ రూమ్‌లో కేటీఆర్‌ను, న్యాయవాదిని లైబ్రరీలో కూర్చోబెట్టేందుకు ఏసీబీ ఏర్పాట్లు చేసింది. కేటీఆర్ విచారణ న్యాయవాదికి విజిబుల్ డిస్టెన్స్‌లో ఉండే విధంగా ఏసీబీ చర్యలు తీసుకుంది. ఫార్ములా ఈ కార్ రేసింగ్‌లో నిబంధనలు పాటించకుండా రూ.55 కోట్లు ఎఫ్‌ఈవోకు బదిలీ చేయడంపై కేటీఆర్‌ను ఏసీబీ విచారణ చేయనుంది.


మరోసారి నోటీసులు..

కాగా.. ఈ కేసుకు సంబంధించి ఈనెల 6న విచారణకు రావాల్సిందిగా తొలుత కేటీఆర్‌‌కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఏసీబీ నోటీసుల మేరకు కేటీఆర్ ఈనెల 6న న్యాయవాదితో కలిసి ఏసీబీ కార్యాలయానికి వచ్చారు. న్యాయవాదితో కలిసి విచారణకు వచ్చేందుకు ఏసీబీ అధికారులు నిరాకరించారు. చాలా సేపు కేటీఆర్ ఏసీబీ కార్యాలయం బయటే ఉన్నారు. న్యాయవాదితో కలిసే విచారణకు వస్తానని.. లేకపోతే లేదని తేల్చిచెప్పారు. చివరకు ఏసీబీ అధికారులకు లిఖితపూర్వకంగా లేఖ రాసి కేటీఆర్ విచారణకు హాజరుకాకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు. అనంతరం ఏసీబీ మరోసారి కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చింది. ఈరోజు (జనవరి 9) విచారణకు రావాల్సిందిగా ఏసీబీ నోటీసుల్లో పేర్కొంది. అయితే విచారణకు న్యాయవాదితో కలిసి వచ్చే అంశంపై కేటీఆర్‌.. హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో కేటీఆర్‌ లంచ్‌మోషన్‌ పిటిషన్ వేయగా.. నిన్న విచారణ జరిగింది. అయితే థర్డ్‌ డిగ్రీ ఉపయోగిస్తారమే అని కేటీఆర్ భయపడుతున్నారేమో అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. కేటీఆర్‌కు దగ్గరలో న్యాయవాది ఉండేలా చర్యలు తీసుకోవాలని ఏసీబీకి హైకోర్టు ఆదేశించింది. ఎట్టిపరిస్థితుల్లోనూ విచారణ గదిలోకి అనుమతిని ఇచ్చేది లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది.

Tirupati: ఏమిటిది స్వామి...


అరెస్ట్ ఖాయమా..

మరోవైపు నిన్న(బుధవారం) నాటి పురపాలకశాఖ ప్రత్యేక అధికారి అరవింద్ కుమార్‌ను విచారించిన ఏసీబీ.. పలు కీలక సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. వాటి ఆధారంగానే కేటీఆర్‌పై ప్రశ్నలు సంధించేలా ఏసీబీ ముందుగానే ప్లాన్‌ను సిద్ధం చేసుకుంది. అయితే ఈరోజు ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరుకానున్న నేపథ్యంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. విచారణ అనంతరం కేటీఆర్‌‌ను అరెస్ట్ చేస్తారనే వార్తలు కూడా ప్రచారం జరుగుతోంది.


ఈడీ విచారణకు ఐఏఎస్

కాగా.. ఫార్ములా ఈ కార్ రేసింగ్‌లో ఈడీ దూకుడు పెంచింది. నిన్న హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎన్‌ఎల్ రెడ్డిని విచారించిన ఈడీ.. ఈరోజు ఈ కేసులో ఏ2 గా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌ను విచారించనున్నారు. ఈ కేసులో అరవింద్ కుమార్ స్టేట్‌మెంట్‌ను ఈడీ రికార్డు చేయనుంది. నిన్న 6 గంటల పాటు అరవింద్ కుమార్‌ను ఏసీబీ విచారించిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి అరవింద్‌ కుమార్ పలు కీలక సమాచారం ఏసీబీకి ఇచ్చినట్లు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి...

TTD: తిరుపతిలో తొక్కిసలాట ఆరుగురి దుర్మరణం

కేటీఆర్‌ ఇంటికా? జైలుకా?

Read Latest Telangana News And Telugu news

Updated Date - Jan 09 , 2025 | 01:21 PM