Telangana Group 3 results: తెలంగాణ గ్రూప్ -3 ఫలితాలు విడుదల

ABN, Publish Date - Mar 14 , 2025 | 03:14 PM

Telangana Group 3 results: తెలంగాణ గ్రూప్‌-3 ఫలితాలు వచ్చేశాయి. మొత్తం 1,365 గ్రూప్‌-3 సర్వీసుల పోస్టుల భర్తీకి కోసం టీజీపీఎస్సీ రాత పరీక్షలు నిర్వహించింది.

Telangana Group 3 results: తెలంగాణ గ్రూప్ -3 ఫలితాలు విడుదల
Telangana Group 3 results

హైదరాబాద్, మార్చి 14: తెలంగాణ గ్రూప్-3 ఫలితాలు (Telanagana Group -3 Results) శుక్రవారం విడుదలయ్యాయి. జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్ట్‌‌ను టీజీపీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 1,365 గ్రూప్‌-3 సర్వీసుల పోస్టుల భర్తీకి కోసం టీజీపీఎస్సీ రాత పరీక్షలు నిర్వహించగా.. ఈరోజు ఫలితాలను రిలీజ్ చేసింది. గత ఏడాది నవంబర్‌ 17, 18 తేదీల్లో గ్రూప్-3 రాత పరీక్షలు జరిగాయి. ఈ పోస్టుల కోసం 5.36 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 50.24 శాతం మంది అభ్యర్థులు మాత్రమే పరీక్షలకు హాజరయ్యారు. గ్రూప్‌-3లో టాప్‌ ర్యాంకర్‌(పురుషులు) 339.24 మార్కులు, గ్రూప్‌-3లో మహిళా టాప్‌ ర్యాంకర్‌కు 325.15 మార్కులు వచ్చాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ https://www.tspsc.gov.in/ ద్వారా చెక్‌ చేసుకోవచ్చిన టీజీపీఎస్సీ అధికారులు పేర్కొన్నారు.


కాగా.. ఈ నెలలోనే గ్రూప్ 1, గ్రూప్ -2 ఫలితాలను కూడా టీజీపీఎస్సీ విడుదల చేసిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం ఈనెల 10, 11 తేదీల్లోనే గ్రూప్ 1 మెయిన్ ఫలితాలు, గ్రూప్-2 రాత పరీక్షల మార్కులను టీజీపీఎస్సీ రిలీజ్ చేసింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో 563 పోస్టుల భర్తీకి గత ఏడాది అక్టోబరు 21 నుంచి 27 వరకు గ్రూప్-1 పరీక్షలు జరిగాయి. ఈ మెయిన్స్‌కు 21,093 మంది అభ్యర్థులు హాజరయ్యారు. గ్రూప్ - 1 ఫలితాలను మార్చి 10న టీజీపీఎస్సీ విడుదల చేసింది.

Kurnool Holi tradition: మగాళ్లంతా ఆడవారిలా మారిపోతారు.. అదో వింత ఆచారం


గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదలైన తర్వాతి రోజే గ్రూప్ -2 ఫలితాలను కూడా విడుదల చేసింది టీజీపీఎస్సీ. ఈనెల 11న గ్రూప్-2 ఫలితాలు విడుదలయ్యాయి. గతేడాది డిసెంబర్ 15, 16 తేదీల్లో 783 గ్రూప్‌-2 పోస్టుల భర్తీకి పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షకు మొత్తం 2.36 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. గ్రూప్ 2 టాపర్‌కు అత్యధికంగా 447 మార్కులు వచ్చాయి. జనరల్ ర్యాంకులతో పాటు ఫైనల్‌ కీ కూడా విడుదలైంది.


ఇవి కూడా చదవండి...

Holi celebration controversy: హోలీ సంబరాల్లో టెన్షన్ టెన్షన్.. ఏం జరిగిందంటే

Farmhouse case investigation: విచారణకు హాజరైన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 14 , 2025 | 03:41 PM