Gurumurthy Remand Report: గురుమూర్తి రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు.. అందుకే చంపేశాడు

ABN, Publish Date - Feb 09 , 2025 | 05:24 PM

Gurumurthy Remand Report: రిమాండ్‌లో ఉన్న గురుమూర్తి కీలక విషయాలు వెల్లడించాడు. ఈ హత్య చేయడానిక కారణాలను వివరించాడు. అలాగే తనకు సహకరించిన వారి వివరాలను సైతం అతడు వివరించాడు. దీంతో గురుమూర్తి రిమాండ్ రిపోర్ట్ సంచలనంగా మారింది.

Gurumurthy Remand Report: గురుమూర్తి రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు.. అందుకే చంపేశాడు

హైదరాబాద్, ఫిబ్రవరి 09: మీర్‌పేట్‌లో భార్య మాధవీని అత్యంత దారుణంగా హత్య చేసిన గురుమూర్తి రిమాండ్ రిపోర్ట్‌లో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చింది. అందుకు సంబంధించిన విషయాలను పోలీసులు ఆదివారం హైదరాబాద్‌లో వివరించారు. పంచాయతీ పెట్టి తన పరువు తీసిందంటూ భార్యపై గురుమూర్తి కోపం పెంచుకొన్నాడు. ఆ క్రమంలో ఆమెను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం పక్కా ప్రణాళికతో స్కెచ్ వేశాడు.

అందులోభాగంగానే జనవరి 15వ తేదీన తన పిల్లలను తన చెల్లెలు నివాసం వద్ద గురుమూర్తి వదిలాడు. 16 వ తేదీన తన పుట్టింటికి వెళ్తానన్న భార్యతో గురుమూర్తి.. ఘర్షణకు దిగాడు. తనకు.. మీ చెల్లెలు ఇంట్లో ఉండడం ఇష్టం లేదనడంతో.. పిల్లలను అక్కడే వదిలి భార్యను గురుమూర్తి ఇంటికి తీసుకొచ్చాడు. తనని ఎందుకు పట్టింటికి పంపడం లేదంటూ భర్త గురుమూర్తిని భార్య మాధవి ప్రశ్నించింది. ఆ క్రమంలో ఇద్దరి మధ్య వివాదం పెరిగడంతో.. భార్య మాధవి గొంతు నులిమి అతడు హత్య చేశారు.


అదే రోజు భార్యను హత్య చేసి ముక్కలు చేశాడు. అనంతరం వాటిని నీటి హీటర్‌లో ఉడికించాడు. ఎముకులను పొడి చేసి.. మిగిలిన మాంసం ముక్కలను బకెట్‌లో వేసి పెద్ద చెరువులో గురుమూర్తి పడేశాడు. ఆ తర్వాత జనవరి 18వ తేదీన కుమార్తె కనిపించడం లేదంటూ మాధవి తల్లి పోలీసులను ఆశ్రయించింది. భర్తతో గొడవ పడి.. ఇంటి నుంచి వెళ్లిపోయిందంటూ ఆ ఫిర్యాదులో మాధవి తల్లి పేర్కొంది. దీంతో మిస్సింగ్ కేసు కింద మీర్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు.

Also Read: ప్రైవేట్ ఆసుపత్రులకు హెల్త్ మినిస్టర్ కీలక సూచన


మాధవి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అందులోభాగంగా గురుమూర్తి నివాసం సమీపంలోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. అదే సమయంలో గురుమూర్తి కదలికలను వారు పరిశీలించారు. అయితే 15వ తేదీన ఇంట్లోకి వెళ్లిన మాధవి. ఆ మరునాడు అంటే 16వ తేదీ.. గురుమూర్తి బయటకు బకెట్‌తో వచ్చాడు. దీంతో గురుమూర్తి కదలికలపై పోలీసులకు సందేహం రావడంతో.. అతడిని పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించారు.

Also Read: ఢిల్లీ సీఎం అభ్యర్థి ఫిక్స్.. అధిష్టానం చూపు అతడి వైపే


ఇక 28వ తేదీన తానే మాధవిని హత్య చేశానని ఆమె తండ్రికి గురుమూర్తి సమాచారం అందించాడు. ఈ విషయాన్ని పోలీసులకు మాదవీ తండ్రి వెంకట రమణ తెలియజేశారు. దీంతో గురుమూర్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. పోలీసుల సమక్షంలో తానే ఈ హత్య చేసినట్లు వెల్లడించాడు. అతడు ఇచ్చిన క్లూస్ ఆధారంగా పోలీసులు.. మీర్ పేటలోని చెరువులో పెద్ద గజ ఈతగాళ్లతో వారం రోజుల పాటు వెతికించారు. మాంసం ముక్కలు పడేసిన బకెట్ లభ్యమైంది.

Also Read: దండకారణ్యంలో ఎన్‌కౌంటర్.. మావోయిస్టులకు భారీ దెబ్బ


అనంతరం గురుమూర్తి నివాసం వద్ద నివసిస్తున్న ఇరుగు పొరుగు వారిని సాక్ష్యాలను పోలీసులు సేకరించారు. మాధవి హత్య జరిగిన రోజుతోపాటు ఆ మరునాడు గురుమూర్తి ఇంటి నుంచి చమురు వాసన వచ్చిదంటూ వారు పోలీసులకు వివరించారు. దీంతో ఈ వాసనపై పక్కింట్లోని సదాశివుడు అనే వ్యక్తి గురుమూర్తిని ప్రశ్నించారు. తమ ఇంట్లో నాన్ వేజ్ కర్రీ వండుతానని వారికి గురుమూర్తి వివరించాడు.


ఇక బాత్ రూమ్‌లో మృతదేహాన్ని ముక్కలు చేశాడు. ఉడికించిన వ్యర్దాలను కమోడ్ లో వేసి గురుమూర్తి ఫ్లష్ చేశాడు. ఆ తర్వాత ఇల్లు వాసన రాకుండా ఉండేందుకు ఫినాయిల్‌తో శుభ్రం చేశాడు. ఇక నిందితుని ఇంటి నుంచి కత్తి, రంపం, స్టవ్, ఫినాయిల్ సీసాలతోపాటు పెయింట్ బకెట్ స్వాధీనం. మరోవైపు గురుమూర్తికి అతడి చెల్లెలు సుజాత, తల్లి సుబ్బలక్షమ్మతోపాటు తమ్ముడు కిరణ్‌ను పోలీసులు అదుపులో తీసుకున్నారు. అయితే సాక్ష్యాలు మాయం చేసేందుకు ప్రయత్నించారని అభియోగం నేపథ్యంలో వారిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.

For Telangana News And Telugu News

Updated Date - Feb 09 , 2025 | 05:33 PM