BJP MLC Candidate: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి ఎవరంటే
ABN, Publish Date - Apr 04 , 2025 | 12:09 PM
BJP MLC Candidate: హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజవర్గంలో ఎమ్మెల్సీ అభ్యర్థి పేరును ఖరారు చేసింది బీజేపీ అధిష్టానం. నేటితో నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: హైదరాబాద్ స్థానిక సంస్థల (Hyderabad Local Body MLC Election) కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థి పేరును పార్టీ అధిష్టానం శుక్రవారం ప్రకటించింది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్.గౌతం రావు (MLC Canditate N Gautham Rao) పేరును ఖరారు చేసింది బీజేపీ హైకమాండ్. ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీ ఎం.ఎస్ ప్రభాకర్ పదవీకాలం మే 1తో ముగియనుంది. దీంతో కొత్త ఎమ్మెల్సీ ఎన్నికకు ఏప్రిల్ 23న పోలింగ్ జరుగనుంది. హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికకు మార్చి 24న కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. నేటితో (శుక్రవారం) నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ. దీంతో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతం రావు పేరును ఖరారు చేసింది హైకమాండ్. మరికాసేపట్లో గౌతం రావు నామినేషన్ దాఖలు చేయనున్నారు.
ఏప్రిల్ 7న నామినేషన్ల పరిశీలన ప్రక్రియ జరుగనుండగా.. ఏప్రిల్ 9 నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. ఇక ఏప్రిల్ 23న పోలింగ్ జరుగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఏప్రిల్ 25న ఫలితాలను ప్రకటించనున్నారు. హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజవర్గం ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదల కావడంతో కోడ్ అమలులోకి వచ్చింది.
డైలమాలో పార్టీలు..
మరోవైపు గ్రేటర్ హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ ఎన్నిక పొలిటికల్ హీట్ పెంచుతోంది. లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ దూరంగా ఉంటాయని ప్రచారం జరుగుతోంది. నేటితో నామినేషన్లు ముగిస్తుండగా.. పోటీపై పార్టీల్లో డైలమా కొనసాగుతోంది. ఎంఐఎంకు కాంగ్రెస్ మద్దతు ఇస్తోంది. కాంగ్రెస్ మద్దతుతో ఎంఐఎంకు ఎమ్మెల్సీ దక్కే అవకాశం ఉంది. వచ్చే ఏడాది జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం, కాంగ్రెస్ ఒకరికి ఒకరు సహకరించునేలా ఒప్పందం జరిగింది. మరోవైపు బీఆర్‌ఎస్ ఓటర్లకు పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలు ఇంకా అందలేదు. ఇటీవల జరిగిన మూడు ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్‌ఎస్ దూరంగా ఉంది. జీహెచ్‌ఎంసీ ఎమ్మెల్సీ ఎన్నికకు కూడా దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
Borugadda Anil: రాజమండ్రి నుంచి అనంతపురంకు బోరుగడ్డ.. ఎందుకంటే
Pharmacist Death: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఫార్మసిస్ట్ కన్నుమూత
Read Latest Telangana News And Telugu News
Updated Date - Apr 04 , 2025 | 12:39 PM