USA: అమెరికాలో మరో తెలుగు యువకుడు దారుణ హత్య
ABN , Publish Date - Jan 20 , 2025 | 11:14 AM
Hyderabad: అమెరికాలో హైదరాబాద్ యువకుడిపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు హైదరాబాద్‌కు చెందిన రవితేజగా గుర్తించారు. నగరంలోని చైతన్యపురి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆర్కేపురం గ్రీన్ హిల్స్ కాలనీలో రవితేజ కుటుంబం నివాసం ఉంటోంది. 2022 మార్చిలో రవితేజ పై చదువుల కోసం అమెరికాకు వెళ్లాడు.

హైదరాబాద్, జనవరి 20: అమెరికాలో (America) గన్‌కల్చర్ పెరిగిపోతోంది. దుండగుల తూటాలకు ఎందరో అభాగ్యులు బలైపోతున్నారు. ఉన్నత విద్య కోసం, ఉజ్వల భవిష్యత్ కోసం స్వదేశాన్ని వీడి అమెరికాకు వెళ్తుంటారు ఎందరో. అక్కడే ఎంతో కష్టపడి చదువుకోవడమే కాకుండా.. ఉద్యోగాలు సంపాదించి స్థిరపడిపోతుంటారు. కానీ అమెరికాలో పెరిగిపోతున్న గన్‌కల్చర్‌కు ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా ఇండియా నుంచి వెళ్లిన ఎంతో మంది.. అక్కడి దుండగుల ఆకృత్యాలకు బలయ్యారు. తాజాగా ఉన్నత చదవుల కోసం వెళ్లిన ఓ యువకుడు.. తన కలలు నెరవేరకుండానే ఓ దుండగుడి చేతిలో హత్యకు గురయ్యాడు. ఇంతకీ ఎవరా యువకుడు.. అమెరికాలో ఏం జరిగింది.. ఇప్పుడు చూద్దాం.
అమెరికాలో హైదరాబాద్ యువకుడిపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు హైదరాబాద్‌కు చెందిన రవితేజగా గుర్తించారు. నగరంలోని చైతన్యపురి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆర్కేపురం గ్రీన్ హిల్స్ కాలనీలో రవితేజ కుటుంబం నివాసం ఉంటోంది. 2022 మార్చిలో రవితేజ పై చదువుల కోసం అమెరికాకు వెళ్లాడు. మాస్టర్స్ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు రవితేజ. ఈ క్రమంలో అమెరికాలోని వాషింగ్టన్ ఏస్‌లో గత రాత్రి ఒక్కసారిగా యువకుడిపై దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన రవితేజ ఘటనా స్థలంలోని ప్రాణాలు కోల్పోయాడు.
Hyderabad Student Shot Dead in Washington
సమాచారం అందిన వెంటనే అక్కడి పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు. రవితేజ మృతి సమాచారాన్ని హైదరాబాద్‌లోని కుటుంబసభ్యులకు తెలియజేశారు. రవితేజ మృతితో ఆర్కేపురంలో విషాదఛాయులు అలముకున్నాయి. ఉన్నత విద్యను పూర్తి చేసి.. ఉద్యోగం చేస్తూ తమకు అండగా ఉంటాడని భావించిన బిడ్డ ఇలా హత్యకు గురవడంతో రవితేజ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రవితేజ మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఇవి కూడా చదవండి..
Hyderabad: నాలుగు రాష్ట్రాల పోలీసులకు సవాల్ చేస్తున్న దొంగల ముఠా..
Davos: సీఎం రేవంత్ రెడ్డి బృందం దావోస్ పర్యటన
Read Latest Telangana News And Telugu News