Kaleshwaram Commission: కేసీఆర్‌పై కాళేశ్వరం కమిషన్ ఫోకస్
ABN, Publish Date - Jan 20 , 2025 | 03:59 PM
KCR: మార్చ్ నెలాఖరి కల్లా ప్రభుత్వానికి నివేదిక అందించేలా కాళేశ్వరం కమిషన్ చైర్మన్ కసరత్తు చేస్తోంది. ఇప్పటి వరకు ఇంజనీర్లు, ఐఏఎస్ అధికారులు, డిజైనర్లను విచారించి స్టేట్‌మెంట్లను రికార్డు చేసిన కమిషన్.. ఇక ఆనాటి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన నేతలపై దృష్టిసారించింది.

హైదరాబాద్, జనవరి 20: కాళేశ్వరం ప్రాజెక్టులో (Kaleshwaram Project) అవకతవకలపై కమిషన్ విచారణ కొనసాగుతోంది. ఒక వైపు విచారణ.. మరోవైపు రిపోర్ట్ తయారీపై కాళేశ్వరం కమిషన్ ప్రధానంగా దృష్టిపెట్టింది. ఇప్పటి వరకు జరిగిన విచారణపై ప్రాథమిక నివేదికను కమిషన్ సిద్ధం చేసింది. దాదాపు 208 పేజీలతో కమిషన్ చైర్మన్ పీసీ చంద్ర ఘోష్ నివేదికను సిద్ధం చేశారు. విచారణ పూర్తయిన తర్వాత ఫైనల్ రిపోర్ట్ ఇచ్చేందుకు కమిషన్ ప్రిపేర్ అవుతున్నారు. వచ్చే నెల వరకు అధికారులు, కాంట్రాక్టు సంస్థల విచారణ పూర్తి చేయాలని నిర్ణయించింది. అనంతరం మార్చ్‌లో మాజీ మంత్రులు హరీష్ రావు (Harish Rao), ఈటల రాజేందర్‌ను (Etela Rajender) కమిషన్ విచారణకు పిలవనుంది.
ఇక ఫైనల్‌గా మార్చ్‌లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విచారణకు పిలిచే యోచనలో కమిషన్ ఉన్నట్లు తెలుస్తోంది. విచారణలో భాగంగా కాళేశ్వరం ఇంజనీర్లు, అధికారులు కేసీఆర్ పేరు చెప్పారు. కేసీఆర్ ఆదేశాల మేరకే నిర్ణయాలు తీసుకున్నామని ఒప్పుకున్నారు. దీంతో కేసీఆర్‌ను కూడా ప్రశ్నించాలని కమిషన్ నిర్ణయం తీసుకుంది. మార్చ్ నెలాఖరి కల్లా ప్రభుత్వానికి నివేదిక అందించేలా కమిషన్ చైర్మన్ కసరత్తు చేస్తోంది. ఇప్పటి వరకు ఇంజనీర్లు, ఐఏఎస్ అధికారులు, డిజైనర్లను విచారించి స్టేట్‌మెంట్లను రికార్డు చేసిన కమిషన్.. ఇక ఆనాటి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన నేతలపై దృష్టిసారించింది. అందులో ప్రధానంగా కేసీఆర్, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్, ఆనాడు నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్‌రావుకు కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు జరిగిన విచారణలో హాజరైన ఇంజనీర్లు, అధికారుల్లో ఎక్కుగా.. కేసీఆర్ నిర్ణయాల మేరకు ముందుకు వెళ్లినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ను విచారించాలనే నిర్ణయానికి కమిషన్ వచ్చింది.
కోల్‌కతా వైద్య విద్యార్థి హత్యాచారం: దోషికి ఏ శిక్ష విధించారంటే..?
కాగా.. సంక్రాంతి పండుగ సందర్భంగా విచారణకు కాస్త బ్రేక్ ఇచ్చిన కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పీసీ చంద్ర ఘోష్ తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఇక మరింత వేగంగా కమిషన్ విచారణ సాగనుంది. రేపటి (మంగళవారం) నుంచి తిరిగి కమిషన్ విచారణ ప్రారంభంకానుంది. పలువురు ఫైనాన్స్ ఉద్యోగులకు కాళేశ్వరం కమిషన్ నోటీసులు పంపింది. ఈ క్రమంలో రేపటి నుంచి ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఫైనాన్స్ విభాగం ఉద్యోగులు, కాంట్రాక్ట్ సంస్థలను కమిషన్ వరుసగా విచారించనుంది. ఈ దఫా విచారణలో వి.ప్రకాష్‌ను బహిరంగ విచారణకు కాళేశ్వరం కమిషన్ పిలువనుంది. మాజీ ఈఎన్‌సీని మరొక్కసారి బహిరంగ విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఈ సెషన్‌లో క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియను కమిషన్ ముగించనుంది. ఇప్పటివరకు ఫైనాన్స్ అండ్ పాలసీ, టెక్నికల్ అంశాలపై విచారణను పూర్తి చేసింది కమిషన్. నిబంధనలు పాటించకుండా నిధులు విడుదల చేసినట్లు గుర్తించింది. నిబంధనలు పాటించని అధికారులపై సెక్షన్ 70 ప్రకారం చర్యలు తీసుకావాలని సూచించింది. పనులు పూర్తి కాకుండానే బిల్లులు విడుదల చేసినట్లు కాళేశ్వరం కమిషన్ గుర్తించింది.
ఇవి కూడా చదవండి..
Davos: సీఎం రేవంత్ రెడ్డి బృందం దావోస్ పర్యటన
USA: అమెరికాలో మరో తెలుగు యువకుడు దారుణ హత్య
Read Latest Telangana News And Telugu News
Updated Date - Jan 20 , 2025 | 03:59 PM