Crime News: మీర్‌పేట మాధవి హత్య కేసులో కీలక మలుపు..

ABN, Publish Date - Mar 25 , 2025 | 11:00 AM

మాజీ ఆర్మీ అధికారి గురుమూర్తి సంక్రాంతి పండుగ రోజు భార్య వెంకట మాధవిని హత్య చేసి ముక్కలుగా నరికి కాల్చి పొడి చేసి చెరువులో పడవేసిన విషయం తెలిసిందే. భార్య నిత్యం తనను వేధిస్తూ డామినేట్ చేస్తోందని, ప్రతి చిన్న విషయాన్ని వాళ్ల తల్లిదండ్రులకు చెప్పి వాళ్లతో తనను చిత్ర హింసలకు గురిచేస్తోందన్నఅక్రోషంతో హత్య చేశాడు.

Crime News: మీర్‌పేట మాధవి హత్య కేసులో కీలక మలుపు..
Madhavi murder Case

హైదరాబాద్: మీర్‌పేట (Meerpeta)వెంకట మాధవి (Venkata Madhavi) హత్య కేసు (Murder Case) కీలక మలుపు (Key Turning Point) తిరిగింది. ఈ హత్య కేసుకు సంబంధించి డిఎన్ఏ రిపోర్ట్ (DNA Report) పోలీసుల వద్దకు చేరింది. మాధవిని భర్త హత్య చేసి ముక్కలుగా నరికి ఉడకపెట్టి ఎముకలను పొడిగా చేసి చెరువులో వేశాడు. ఎలాంటి ఆధారాలు లేకుండా ధ్వంసం చేశాడు. ఇంట్లో దొరికిన టి ష్యూస్ ఆధారంగా కేసులో గురుమూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. క్లుస్ టీం ఇచ్చిన టి ష్యూస్‌ని డిఎన్ఏ కోసం పోలీసులు పంపారు. మాధవి డిఎన్ఏతో తల్లి, పిల్లల డిఎన్ఏతో మ్యాచ్ అయినట్లు ఫోరెన్సిక్ అధికారులు పేర్కొన్నారు.

Also Read..: ABN Live..: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు


మాజీ ఆర్మీ అధికారి గురుమూర్తి సంక్రాంతి పండుగ రోజు భార్యను హత్య చేసి ముక్కలుగా నరికి కాల్చి పొడి చేసి చెరువులో పడవేసిన విషయం తెలిసిందే. భార్య నిత్యం తనను వేధిస్తూ డామినేట్ చేస్తోందని, ప్రతి చిన్న విషయాన్ని వాళ్ల తల్లిదండ్రులకు చెప్పి వాళ్లతో తనను చిత్ర హింసలకు గురిచేస్తోందన్నఅక్రోషంతో హత్య చేశాడు.

కాగా మీర్‌పేట హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు మీడియా సమావేశంలో వివరించారు. వెంకట మాధవి హత్య కేసులో ఆధారాల కోసం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందన్నారు. ఈ హత్యకు ఉపయోగించిన 16 వస్తువులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇలాంటి కేసు ఇప్పటి వరకు చూడలేదన్నారు. అయితే ఈ హత్యకు పాల్పడిన నిందితుడు గురుమూర్తిలో మాత్రం ఎలాంటి పశ్చాత్తాపం లేదని పేర్కొన్నారు. ఇక ఈ హత్యకు సంబంధించిన సైంటిఫిక్ ఆధారాలను సైతం సేకరించామని వివరించారు. ఈ కేసులో నిందితుడు గురుమూర్తిపై బీఎన్ఎస్ 103(1), 238, 85 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. గురుమూర్తి గతంలో ఆర్మీలో పని చేశాడన్నారు.


అయితే భార్య వెంకట మాధవిని హత్య చేయాలని గురుమూర్తి ముందే ప్లాన్‌ చేశాడని.. అందుకోసం పిల్లలను వాళ్ల బంధువుల ఇంట్లో ఉంచాడని సీపీ సుధీర్ బాబు తెలిపారు. అయితే వెంకట మాధవిని హత్య చేసిన తర్వాత.. ఆమె డెడ్ బాడీని 8 గంటల పాటు ముక్కలుగా చేసి పౌడర్‌గా మార్చాడన్నారు. ఎముకలు కాల్చిన బూడిదను చెరువులో గురుమూర్తి పడేశారని వివరించారు. ఆ తర్వాత సర్ఫ్‌, ఫినాయిల్‌లను ఉపయోగించి.. ఎక్కడ ఆధారాలు లేకుండా చేశాడని వివరించారు. భార్య వెంకట మాధవిని ఇంట్లోనే దారుణంగా హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకొన్నాడని.. అలాగే ఆమె డెడ్ బాడీని సైతం ముక్కలుగా చేసినట్లు నేరాన్ని అంగీకరించాడని సీపీ సుధీర్ బాబు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పోలీస్ వాహనంపై రాళ్లతో ఆందోళనకారుల దాడి

శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్‌ తిరుమంజనం

SLBC.. మరో మృతదేహాన్ని గుర్తించిన రెస్క్యూ టీమ్‌

For More AP News and Telugu News

Updated Date - Mar 25 , 2025 | 11:00 AM