King Fisher: మద్యం ప్రియులకు షాక్.. కింగ్ ఫిషర్ బీర్లు బంద్..
ABN, Publish Date - Jan 08 , 2025 | 04:09 PM
మద్యం ప్రియులకు బిగ్ షాక్. ఇక నుంచి తెలంగాణలో ఆ బీర్ల అమ్మకాలు బంద్ కానున్నాయి. కింగ్ ఫిషర్, హీనెకెన్ బీర్లను నిలిపివేశారు.
హైదరాబాద్, జనవరి 08: తెలంగాణలో మద్యం ప్రియులకు షాకింగ్ న్యూస్ ఇది. ఇక నుంచి తెలంగాణలో కింగ్ ఫిషర్, హీనెకెన్ బీర్ల అమ్మకాలు బంద్ కానున్నాయి. ఇందుకు కారణం.. ఆ బీర్ల తయారీ కంపెనీ తీసుకున్న నిర్ణయమే. అవును.. తెలంగాణకు తమ బీర్లను సప్లయ్ చేయబోమంటూ యునైటెడ్ బ్రేవరేస్ లిమిటెడ్ తేల్చి చెప్పింది. ఈ మేరకు బుధవారం నాడు అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది. బీర్ల ధరలను సవరించకపోవడంతో పాటు.. పాత బకాయిలను తెలంగాణ ప్రభుత్వం చెల్లించకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయంతో.. తెలంగాణలో కింగ్ ఫిషర్, హీనెకెన్ బీర్ల సరఫరా నిలిచిపోనుంది.
కంపెనీ ప్రకటనలో ఏముందంటే..
సెబీ లిస్టింగ్ రెగ్యులేషన్స్‌లోని రెగ్యులేషన్ 30కి ప్రకారం.. తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్(TGBCL)కి తమ బీర్ సరఫరాను తక్షణమే నిలిపివేస్తున్నట్లు యునైటెడ్ బ్రేవరేస్ లిమిటెడ్ తన లేఖలో పేర్కొంది. టీజీబీసీఎల్ బీర్ల ప్రాథమిక ధరను 2019 నుంచి ఇప్పటి వరకు సవరించలేదని.. దీని కారణంగా రాష్ట్రంలో భారీగా నష్టాలు వస్తున్నాయని పేర్కొంది. అలాగే.. బీర్ల సరఫరాకు సంబంధించి తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ చాలా బకాయి పడిందని.. ఆ బిల్లులు చెల్లించకపోవడంతో కంపెనీ తీవ్రంగా నష్టపోతుందన్నారు. ఈ కారణంగా టీజీబీసీఎల్‌కి బీర్లను సరఫరా చేయడం సాధ్యం కాదని, ఇక నుంచి బీర్ల సరఫరా నిలిపివేస్తున్నట్లు యూబీఎల్ తన లేఖలో స్పష్టం చేసింది. తమ సమస్యలను ప్రభుత్వం అర్థం చేసుకోవాలని యూబీఎల్ విజ్ఞప్తి చేసింది.
Also Read:
కేటీఆర్‌పై థర్డ్ డిగ్రీ..? హైకోర్టు కీలక వ్యాఖ్యలు..
కేజీఎఫ్ సినిమాను గుర్తు చేస్తున్న బైక్..
విజయసాయిపై కేవీ రావు ఏం చెప్పబోతున్నారు..
For More Telangana News and Telugu News..
Updated Date - Jan 08 , 2025 | 04:49 PM