ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Medchal: ప్రియురాలి కోసం యువకుల మధ్య ఘర్షణ.. చివరికి ఏమైందంటే..

ABN, Publish Date - Jan 04 , 2025 | 12:00 PM

తెలంగాణ: మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి మల్లికార్జున నగర్‌లోని ఓ బాయ్స్ హాస్టల్లో మహేందర్ రెడ్డి(38) దారుణ హత్యకు గురయ్యాడు. అదే హాస్టల్‌లో ఉంటున్న కిరణ్ రెడ్డి అనే వ్యక్తి మహేందర్ రెడ్డిని అతి కిరాతంగా చంపేశాడు. వంట సామగ్రితో దాడి చేసి అనంతరం కత్తితో పొడిచి హతమార్చాడు.

Medipalli Police Station

మేడ్చల్: మేడిపల్లి బాయ్స్ హాస్టల్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. వివాహేతర సంబంధం నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఓ మహిళ కోసం ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణ ఒకరి ప్రాణాలు పోవడానికి కారణం అయ్యింది. ప్రియురాలు తనకే దక్కాలని భావించిన ఓ యువకుడు అతి దారుణంగా కత్తితో పొడిచి మరో యువకుడిని హత్య చేశాడు. కాగా, ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.


మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి మల్లికార్జున నగర్‌లోని ఓ బాయ్స్ హాస్టల్లో మహేందర్ రెడ్డి(38) దారుణ హత్యకు గురయ్యాడు. అదే హాస్టల్‌లో ఉంటున్న కిరణ్ రెడ్డి అనే వ్యక్తి మహేందర్ రెడ్డిని అతి కిరాతంగా చంపేశాడు. వంట సామగ్రితో దాడి చేసి అనంతరం కత్తితో పొడిచి హతమార్చాడు. జనగామకు చెందిన మహేందర్ రెడ్డి గతంలో ఇదే హాస్టల్లో ఉండేవాడు. హాస్టల్ నిర్వాకురాలితో ఇతను సన్నిహితంగా ఉండేవాడు. మహేందర్ రెడ్డి ప్రస్తుతం జనగామలో నివాసం ఉంటున్నాడు. అప్పుడప్పుడు హాస్టల్‌కి వచ్చి వెళ్తుండేవాడు. అయితే కొంతకాలంగా హాస్టల్ నిర్వాహకురాలు కిరణ్ రెడ్డితో సన్నిహితంగా ఉంటూ వస్తోంది.


శుక్రవారం అర్ధరాత్రి జనగామ నుంచి మహేందర్ రెడ్డి హాస్టల్‍కు రాగా.. ఇదే విషయమై కిరణ్, మహేందర్ మధ్య వివాదం చెలరేగింది. ఇది కాస్త ఘర్షణకు దారితీయడంతో రెచ్చిపోయిన కిరణ్ వంట సామగ్రితో మహేందర్ రెడ్డిపై దాడి చేశాడు. అనంతరం అక్కడే ఉన్న కత్తితో పొడిచి హత్య చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడు కిరణ్ రెడ్డి, హాస్టల్ నిర్వహకురాలని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే కావాలనే పిలిపించి పక్కా పథకం ప్రకారం హత్య చేశారా? లేక ఇద్దరి మధ్య గొడవతో క్షణికావేశంలో హత్య జరిగిందా? అనే విషయం తెలియాల్సి ఉంది. ఈ దిశగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Updated Date - Jan 04 , 2025 | 12:00 PM