Minister Ponnam: తిరుపతి ఘటన తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసింది: మంత్రి పొన్నం
ABN, Publish Date - Jan 09 , 2025 | 07:59 AM
తిరుమల తిరుపతి దేవస్థానాల చరిత్రలోనే కనీవినీ ఎరుగని విషాదం చోటుచేసుకుంది. వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకెన్ల జారీలో తొక్కిసలాట జరిగి భక్తులు మరణించిన ఘటన తీవ్ర ధ్రిగ్బాంతికి గురి చేసిందని తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
హైదరాబాద్: తిరుపతి (Tirupati)లో వైకుంఠ ఏకాదశి (Vaikuntha Ekadashi) సర్వదర్శన టోకెన్ల జారీలో తొక్కిసలాట జరిగి భక్తులు (Devotees) మరణించిన ఘటన తీవ్ర ధ్రిగ్బాంతికి గురి చేసిందని తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) అన్నారు. మృతి చెందిన కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని, తొక్కిసలాటలో గాయపడ్డ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరుతున్నానన్నారు. గాయపడ్డ భక్తులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా.. భక్తులు ఎవరు అధైర్యపడవద్దన్నారు. కాగా తిరుమల తిరుపతి దేవస్థానాల చరిత్రలోనే కనీవినీ ఎరుగని విషాదం చోటుచేసుకుంది. వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకెన్ల జారీలో తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. టోకెన్ల జారీకి తిరుపతిలోని తొమ్మిది ప్రాంతాల్లో 90 కౌంటర్లు ఏర్పాటు చేయగా... బైరాగిపట్టెడ వద్ద తీవ్ర తొక్కిసలాట జరిగింది. గురువారం అర్ధరాత్రి నుంచి తిరుమలలో వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్నాయి. దీనికోసం తిరుపతిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో గురువారం తెల్లవారుజామున 5 గంటల నుంచి టోకెన్లను జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది. బుధవారం మధ్యాహ్నం నుంచే కేంద్రాల వద్దకు భారీగా భక్తులు తరలి రావడం మొదలైంది. రాత్రి 8 గంటలకు ఒత్తిడి మరింత పెరిగింది. క్యూలైన్లలోకి రాత్రి 9గంటల నుంచి భక్తులను పంపించడం మొదలుపెట్టారు. దీంతో భక్తులు క్యూలైన్లలో ప్రవేశించడానికి ప్రయత్నించే క్రమంలో బైరాగిపట్టెడ, విష్ణు నివాసం, ఇందిరా మైదానం కేంద్రాల వద్ద తొక్కిసలాటలు జరిగాయి.
ప్రత్యక్షసాక్షులు, ఇతర వర్గాల కథనం ప్రకారం...
బైరాగిపట్టెడలోని రామానాయుడు మునిసిపల్ హైస్కూ లు ఆవరణలో టోకెన్ల జారీకి పది కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఇక్కడికి మధ్యాహ్నం నుంచే తిరుపతి, చుట్టుపక్కల ప్రాంతాలు, తమిళనాడు నుంచి పెద్దసంఖ్యలో భక్తులు చేరుకున్నారు. హైస్కూలు వెనుకవైపు మునిసిపల్ పార్కు లో కూర్చుని... ఎదురు చూస్తున్నారు. రాత్రి 8.50 సమయంలో క్యూలైన్లలోకి అనుమతించడంతో అందరూ పరుగులు తీశారు. పార్కు నుంచి స్కూలులోకి వెళ్లేందుకు ఏర్పాటు చేసిన గేటుపై జనం పడటంతో అది ఒక్కసారిగా తెరుచుకుంది. పెద్దసంఖ్యలో భక్తులు లోనికి వెళ్లేందుకు యత్నించడంతో తొక్కిసలాట జరిగింది. భక్తుల్లో మహిళలు, వృద్ధులు ఉండడంతో చాలామంది కిందపడిపోయారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. పోలీసులు అదనపు బలగాలను రప్పించి అదుపు చేసేసరికే దారుణం జరిగిపోయింది. తొక్కిసలాటలో పలువురు అపస్మారక స్థితికి చేరుకున్నారు. పోలీసులు, స్థానికులు సీపీఆర్ వంటి చర్యలు చేపట్టారు. మరో కథనం ప్రకారం... బైరాగిపట్టెడ కేంద్రంలో ఓ మహిళ అస్వస్థతకు గురి కావడంతో ఆమెను బయటికి తీసుకొచ్చేందుకు పోలీసు అధికారి గేటు తెరిచారని, దీంతో భక్తులు ఒక్కసారిగా ముందుకు రావడంతో తొక్కిసలాట జరిగింది. క్షతగాత్రులను రుయా, స్విమ్స్ ఆస్పత్రులకు తరలించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హుటాహుటిన తిరుపతి చేరుకున్న మంత్రి అనం
సజ్జల భార్గవరెడ్డి చెప్పినట్లు చేశా!
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Jan 09 , 2025 | 07:59 AM