Water Supply: పండుగ వేళ బిగ్ షాక్.. ఈ ప్రాంతాలకు నీటి సరఫరా బంద్..!
ABN, Publish Date - Jan 12 , 2025 | 11:11 AM
భోగి పండుగ రోజున నగరంలోని పలు ప్రాంతాలకు తాగునీటి సరఫరాను బంద్ కానుంది. మంజీరా ప్రాజెక్టు ఫేజ్–2 పరిధిలోని కలబ్‌గూర్ నుంచి హైదర్‌నగర్ వరకు ఉన్న 1500 ఎంఎం డయా పీఎస్సీ పంపింగ్ మెయిన్‌కు పలుచోట్ల భారీ లీకేజీలు..
హైదరాబాద్, జనవరి12: భోగి పండుగ రోజున నగరంలోని పలు ప్రాంతాలకు తాగునీటి సరఫరాను బంద్ కానుంది. మంజీరా ప్రాజెక్టు ఫేజ్–2 పరిధిలోని కలబ్‌గూర్ నుంచి హైదర్‌నగర్ వరకు ఉన్న 1500 ఎంఎం డయా పీఎస్సీ పంపింగ్ మెయిన్‌కు పలుచోట్ల భారీ లీకేజీలు ఏర్పడ్డాయి. వీటిని అరికట్టేందుకు మరమ్మతు పనులు సోమవారం భోగి పండుగ రోజున ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు సంక్రాంతి పండుగ రోజు ఉదయం 6 గంటల వరకు ఈ పనులు చేపట్టనున్నారు. దీంతో వివిధ ప్రాంతాలకు 24గంటల పాటు నీటి సరఫరాలో అంతరాయం తలెత్తుతుందని అధికారులు ప్రకటించారు. ప్రధానంగా ఎర్రగడ్డ, యూసఫ్‌గూడ, బోరబండ, కేపీహెచ్‌బీ కాలనీ, మూసాపేట్, నిజాంపేట్, హైదర్‌నగర్, పటాన్‌చెరు, రామచంద్రాపురం, దీప్తిశ్రీనగర్, మదీనాగూడ, మియాపూర్, హఫీజ్‌పేట్, బీరంగూడ, అమీన్‌పూర్, బొల్లారం పారిశ్రామిక ప్రాంతాలకు నీటి సరఫరాలో అంతరాయం తలెత్తనుందని, నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు వినియోగదారులకు విజ్ఞప్తి చేశారు.
రాత్రి వేళ కమర్షియల్ ట్యాంకర్ల సరఫరా..
కమర్షియల్ విధానంలో ట్యాంకర్లు బుక్ చేసే.. హాస్టళ్లు, హాస్పిటల్స్, హోటల్స్, మాల్స్ తదితర వినియోగదారులతో అగ్రిమెంట్ చేసుకోవాలని వాటర్‌బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి అధికారులకు సూచించారు. పగటి సమయంలో గృహ వినియోగదారులకు ఇబ్బంది లేకుండా.. రాత్రి సమయంలో కమర్షియల్ ట్యాంకర్ డెలివరీ చేసేందుకు ఏర్పాటు చేయాలన్నారు. శనివారం ఎస్‌ఆర్‌నగర్ డివిజన్ పరిధిలోని తట్టిఖానా సెక్షన్‌ను అశోక్‌రెడ్డి వాటర్‌బోర్డు అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎండీ అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. వెయిటింగ్ పిరియడ్, పెండెన్సీ తగ్గించేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని, వాటిని సమర్థంగా అమలు చేస్తే.. సకాలంలో వినియోగదారులకు ట్యాంకర్ డెలివరీ చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. తట్టిఖానా సెక్షన్‌లో ఇప్పటికే 20 ట్యాంకర్లతో దాదాపు 150 ట్రిప్పులను డెలివరీ చేస్తున్నారని, ఇదే డిమాండ్ కొనసాగితే ఏప్రిల్ నాటికి రోజూ 400 ట్రిప్పులు కావాల్సి ఉంటుందని తెలిపారు. ఇప్పుడున్న ఫిల్లింగ్ స్టేషన్‌లోని ఫిల్లింగ్ పాయింట్స్ నిర్మాణ పద్ధతి వల్ల ఒక ట్యాంకర్ నింపడానికి 15 నిమిషాలు పడుతుందని, ఈ ఫిల్లింగ్ సమయాన్ని 5 నిమిషాలకు తగ్గించుకుంటే అనుకున్నదాని కంటే రెట్టింపు ట్రిప్పులు సరఫరా చేయవచ్చని అంచనా వేశారు. దీంతో ట్యాంకర్ వెయిటింగ్ పిరియడ్, పెండెన్సీ తగ్గడంతో పాటు ప్రజలకు సకాలంలో నీరు సరఫరా చేయవచ్చని అన్నారు.
Also Read:
రైతు భరోసాకు మార్గదర్శకాలివే..
బీరు బిర్యానీ లాంటి బీర్ బ్రాండ్లకు చెక్..
For More Telangana News and Telugu News..
Updated Date - Jan 12 , 2025 | 11:12 AM