Share News

Park Hyatt Fire Incident: పార్క్‌ హయత్‌లో మంటలకు కారణం ఏంటంటే

ABN , Publish Date - Apr 14 , 2025 | 03:18 PM

Park Hyatt Fire Incident: పార్క్‌ హయత్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ వెంకన్న వివరణ ఇచ్చారు. పార్క్ హయత్‌ మొదటి అంతస్తులో ఈరోజు పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.

Park Hyatt Fire Incident: పార్క్‌ హయత్‌లో మంటలకు కారణం ఏంటంటే
Park Hyatt Fire Incident

హైదరాబాద్, ఏప్రిల్ 14: నగరంలోని పార్క్ హయత్‌లో (Park Hyatt Fire Incident) ఈరోజు (సోమవారం) అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనపై డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ వెంకన్న ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో (ABN-Andhrajyothy) మాట్లాడుతూ.. పార్క్ హయత్ మొదటి ఫ్లోర్‌లో అగ్ని ప్రమాదం జరిగిందన్నారు. స్పా రూమ్స్‌లో స్టీమ్ బాత్ చేసే ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం జరిగిందని తెలిపారు. స్పా రూమ్స్ ఉడ్‌తో తయారు చేసి ఉందని.. అందుకే మంటలు అంటుకున్నాయని చెప్పారు. షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నామన్నారు. అగ్ని ప్రమాదం వల్ల మంటలతో పాటు పొగ దట్టంగా కమ్ముకుందని అన్నారు. పొగ దట్టంగా కమ్ముకోవడం వల్ల ప్రమాదం జరిగిన చోటుకు పార్క్ సిబ్బంది వెళ్లలేకపోయారన్నారు.


దాంతో పార్క్ హయత్ సిబ్బంది జూబ్లీహిల్స్ ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారన్నారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేయడంతో పాటు పొగను కూడా కంట్రోల్‌లోకి తీసుకొచ్చామని తెలిపారు. అగ్నిప్రమాదంలో ఎవరికి ఎలాంటి అపాయం జరగలేదని తేల్చారు. అగ్ని ప్రమాదం సమయంలో ఆరో ఫ్లోర్లో హైదరాబాద్ సన్‌రైజర్స్ టీం ఉందన్నారు. పవర్ హెచ్చుతగ్గుదల వల్ల షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉందని చెప్పుకొచ్చారు. పవర్ సప్లై విషయంలో జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు కేబుల్స్ సరిచూసుకోవాలని పార్క్ సిబ్బందికి సూచించామని డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ వెంకన్న పేర్కొన్నారు.

Telangana SC Reservation: ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల.. ఇకపై ఉద్యోగాల్లో



కాగా.. ఈరోజు ఉదయం బంజారాహిల్స్‌లోని పార్క్‌హయత్‌ హోటల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన హోటల్ సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న ఫైర్‌ సిబ్బంది కాసేపటికే మంటలను అదుపులోకి తీసుకొచ్చి.. పొగను కూడా కంట్రోల్‌లోకి తీసుకొచ్చారు. అయితే పార్క్‌ హయత్‌ హోటల్‌లోనే హైదరాబాద్ సన్‌రైజర్స్ టీం బస చేస్తోంది. దీంతో ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఫ్యాన్స్ ఒకింత ఆందోళన చెందారు. అయితే సన్‌రైజర్స్‌ టీం సురక్షితంగా ఉన్నట్లు హోటల్ సిబ్బంది చెప్పారు. అలాగే ప్రమాదం జరిగిన వెంటనే సన్‌రైజర్స్ బృందాన్న అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించినట్లు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి

Falaknuma Crime News: వివాహమైన మూడు రోజులకే రౌడీషీటర్ దారుణ హత్య.. ఏం జరిగిందంటే

CM Revanth Praised Women: సన్నబియ్యంతో సహపంక్తి భోజనం.. మహిళకు సీఎం అభినందనలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 14 , 2025 | 03:29 PM