ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: మెుదటిసారి పీఏసీ సమావేశం.. హాజరైన కాంగ్రెస్ పెద్దలు..

ABN, Publish Date - Jan 08 , 2025 | 10:23 PM

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మెుదటిసారిగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (PAC) సమావేశం అయ్యింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ అధ్యక్షతన గాంధీ భవన్‌లో కమిటీ సమావేశం నిర్వహించింది.

Gandhi Bhavan

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మెుదటిసారిగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (PAC) సమావేశం అయ్యింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ అధ్యక్షతన గాంధీ భవన్‌లో కమిటీ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, 23 మంది పీఏసీ సభ్యులు హాజరయ్యారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ ఏడాది పాలన, మంత్రులు, ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ రిపోర్ట్, స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, పార్టీ కార్యక్రమాలు తదితర అంశాలపై చర్చించారు.


పీఏసీ సమావేశానికి ముందు సీఎం రేవంత్ రెడ్డి, కేసీ వేణుగోపాల్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సహా సభ్యులంతా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలుపుతూ రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. అనంతరం సమావేశాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఏడాది పాలనపై నేతల అభిప్రాయాన్ని కేసీ వేణుగోపాల్ తెలుసుకున్నారు. సంవత్సరం పాలనపై టీపీసీసీ చేసిన సీక్రెట్ సర్వేపై పీఏసీలో సభ్యులంతా చర్చించారు. అనంతరం ఏడాదిలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.


ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. "మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతానం తెలిపేందుకు తెలంగాణ అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేశాం. మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశాం. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యింది. పాతబస్తీలో కొత్తగా నిర్మించిన ఫ్లైఓవర్‌కి మన్మోహన్ సింగ్ పేరే పెట్టాం. జనవరి 26న తెలంగాణ అన్నదాతలకు రైతు భరోసా ఇస్తున్నాం. రైతు కూలీలకు సైతం ఏడాదికి రూ.12 వేలు అందిస్తాం. కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం. ఏడాదిలో 55,143 మంది నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. రైతన్నలకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశాం. ఏడాది పాలనలో రూ.54 వేల కోట్లు రైతుల సంక్షేమానికి ఖర్చు చేశాం. రూ.500లకే వంట గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నాం. దీనికి సంబంధించి ఇప్పటివరకూ రూ.4 వేల కోట్లను టీజీఎస్ఆర్టీసీకి కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించింది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించబోతున్నాం. ఈ ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని" చెప్పారు.

Updated Date - Jan 08 , 2025 | 10:23 PM