TG News: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఈ విషయం తెలుసుకుంటే ఎగిరి గంతేస్తారు..
ABN , Publish Date - Jan 03 , 2025 | 09:58 AM
తెలంగాణ: నూతన సంవత్సరంలో విద్యార్థులకు మిఠాయి లాంటి శుభవార్త. కొత్త ఏడాది మెుదటి నెలలోనే ఆదివారాలు కాకుండా ఏకంగా తొమ్మిది సెలవులు వచ్చాయి. హైదరాబాద్‌తోపాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లోని పాఠశాలలకు 2025 జనవరిలో తొమ్మిది సెలవులు ఉండబోతున్నాయి.
హైదరాబాద్: నూతన సంవత్సరంలో విద్యార్థులకు మిఠాయి లాంటి శుభవార్త. కొత్త ఏడాది మెుదటి నెలలోనే ఆదివారాలు కాకుండా ఏకంగా తొమ్మిది సెలవులు వచ్చాయి. హైదరాబాద్‌తోపాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లోని పాఠశాలలకు 2025 జనవరిలో తొమ్మిది సెలవులు ఉండబోతున్నాయి. పబ్లిక్ హాలీడేస్, పండగ సెలవులు, జయంతి వేడుకలు అన్నీ కలిపి ఏకంగా తొమ్మిది రోజులపాటు సెలవులు రావడంతో విద్యార్థులు ఉబ్బితబ్బిపోతున్నారు.
తెలంగాణ క్యాలెండర్ ప్రకారం జనవరి నెలలో నాలుగు సాధారణ సెలవులు ఉన్నాయి. నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1న, భోగి పండగ నేపథ్యంలో జనవరి 13న, సంక్రాంతి సందర్భంగా జనవరి 14, గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో జనవరి 26న సెలవులు ఉన్నాయి. ఈ సెలవుల్లో హైదరాబాద్‌తోపాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లోని అన్ని పాఠశాలలు మూసివేయనున్నారు. ఆదివారాలు, సాధారణ సెలవులు కాకుండా మరో మూడు ఆప్షనల్ హాలిడేస్‌ని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. హజ్రత్ అలీ జయంతి సందర్భంగా జనవరి 14న, కనుము నేపథ్యంలో జనవరి 15న, షబ్-ఎ-మెరాజ్ జన్మదినం సందర్భంగా జనవరి 25న ఆప్షనల్ హాలీడేస్ ఇచ్చింది. అలాగే సెకండ్ సాటర్ డే సందర్భంగా మరో సెలువు విద్యార్థులకు ఇవ్వనున్నారు.
జనవరి 14న హజ్రత్ అలీ పుట్టినరోజు సెలవుదినం కాగా, అదే రోజు సంక్రాంతి పండగ వచ్చింది. అయితే తెలంగాణలోని అన్ని పాఠశాలలు ఆప్షనల్ హాలీడేస్ ప్రకారం మూసివేయరు. షబ్-ఎ-మెరాజ్ జయంతికి మైనారిటీ పాఠశాలలకు మాత్రమే సెలవు ఇవ్వనున్నారు. దీంతో ఆదివారాలు కాకుండా ఏకంగా 9 రోజులు విద్యార్థులకు సెలవులు వచ్చినట్లు అయ్యింది. ఇన్నేసి సెలవులు ఉండడంతో విద్యార్థులు ఎగిరి గంతేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ED: ఫార్ములా ఈ కార్ రేసు కేసులో అధికారులకు మళ్లీ ఈడీ పిలుపు
Hyderabad: సంక్రాంతికి ముందే హైదరాబాదీలకు మరో పండగ.. నేటి నుంచి ప్రారంభం..