Supreme Court: గ్రూప్-1 నియామకాలకు లైన్ క్లియర్.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..

ABN, Publish Date - Apr 04 , 2025 | 09:37 PM

తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన జీవో 29ని రద్దు చేయాలని కోరుతూ ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు అయ్యింది. ఈ పిటిషన్‌ను సూరేపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి వేశారు. దీనిపై శుక్రవారం నాడు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.

Supreme Court: గ్రూప్-1 నియామకాలకు లైన్ క్లియర్.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
Supreme Court

ఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వాని(Telangana Govt)కి సుప్రీంకోర్టు(Supreme Court)లో భారీ ఊరట లభించింది. గ్రూప్ -1 నియామకాల (Group-1 Recruitment)కు లైన్ క్లియర్ చేస్తూ ఉన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 29ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది.


జీవో 29ని రద్దు చేయాలని కోరుతూ సూరేపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఉన్నత న్యాయస్థానం గతంలో ఇచ్చిన తీర్పునకు పూర్తి విరుద్ధంగా తెలంగాణ సర్కార్ జోవో 29ని తీసుకుచ్చిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. జీవో 29 వల్ల రాష్ట్రంలో వేలాది మందికి నష్టం జరిగిందంటూ పిటిషనర్ అత్యున్నత న్యాయస్థానానికి తెలిపారు. దీనిపై శుక్రవారం నాడు జస్టిస్ పమిడి ఘంటమ్ శ్రీ నరసింహ, జస్టిస్ జె.బాగ్చి నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.


ఈ సందర్భంగా జీవో-29పై గతంలోనే పిటిషన్లు దాఖలయ్యాయని, వాటిని సుప్రీంకోర్టు తిరస్కరించిందని ధర్మాసనం గుర్తు చేసింది. గ్రూప్-1కు సంబంధించి నియామక ప్రక్రియ చివరి దశలో ఉందని, ఈ దశలో కలుగజేసుకోలేమంటూ వ్యాఖ్యానించారు. ఈ మేరకు సూరేపల్లి శ్రీనివాస్ వేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ తీర్పునిచ్చింది. దీంతో గ్రూప్-1 నియామకాల్లో తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న చివరి అడంకి సైతం తొలగిపోయినట్లు అయ్యింది.


ఈ వార్తలు కూడా చదవండి:

Toothbrush: టూత్ బ్రష్ వాడుతున్నారా.. ఇవి తెలుసుకోకపోతే అంతే సంగతులు..

Kazakhstan: చర్చనీయాంశంగా మారిన కజకిస్తాన్ దేశం.. అక్కడ దొరికింది చూస్తే..

Vijaya Dairy Price Revision: పాడి రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన విజయ డెయిరీ..

Updated Date - Apr 04 , 2025 | 09:43 PM