TG Govt: రాజలింగమూర్తి హత్యపై ప్రభుత్వం కీలక నిర్ణయం
ABN , Publish Date - Feb 20 , 2025 | 01:23 PM
Telangana Govt: సామాజిక కార్యకర్త రాజలింగ మూర్తి హత్య ఘటనపై తెలంగాణ ప్రభుత్వంపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ హత్యపై విచారణ జరిపించాలని సర్కార్ నిర్ణయించింది.

హైదరాబాద్, ఫిబ్రవరి 20: జయశంకర్ భూపాలపల్లిలో సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి (Social activist Rajalingamurthy) హత్య తీవ్ర కలకలం రేపుతోంది. లింగమూర్తి హత్య ఘటనను తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) సీరియస్‌గా తీసుకుంది. ఈ హత్యపై సీబీసీఐడీ ఎంక్వైరీ వేయాలని నిర్ణయించింది. మేడిగడ్డ అవినీతిపై పోరాడుతున్నందుకే లింగమూర్తిని హత్య చేసారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మరోవైపు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఆయన అనుచరులే రాజలింగమూర్తిని చంపారని మృతుడి భార్య, కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే తన అనుచరుల ద్వారా నడిరోడ్డు మీద తన భర్తను హత్య చేయించారన్న రాజలింగమూర్తి భార్య సరళ ఆరోపించారు.
అన్ని ఆపేస్తే పది లక్షల రూపాయలు ఇస్తామని గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారని తెలిపారు. మేడిగడ్డ కేసు గెలుస్తామని అక్కస్సుతో తన భర్తను దారుణంగా హత్య చేయించారని అన్నారు. కొత్త హరిబాబు రేణిగుంట్ల సంజీవ్ బుర్ర చంద్రయ్య, బుర్ర కొమురయ్య రేనిగుంట్ల కొమురయ్య మరికొంతమంది కలిసి హత్య చేశారని సరళ ఆరోపించారు. కాసేపట్లో రాజలింగమూర్తి మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ఇప్పటికే భూపాలపల్లి ప్రభుత్వ ఆస్పత్రి వద్దకు రాజలింగమూర్తి బంధువులు చేరుకున్నారు.
GV Reddy: వారితో కుట్ర చేస్తున్నారా.. ఏపీ ఫైబర్ నెట్ ఎండీపై జీవీరెడ్డి ఫైర్
కాగా... బైక్‌పై వెళ్తున్న రాజలింగమూర్తిని ఐదుగురు గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి హత్య చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై గతంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావుపై లింగమూర్తి కేసు వేశారు. ఆఫిర్యాదుతో కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావుతో పాటు ఐదుగురిపై కేసు నమోదు అయ్యింది. దీంతో పాటు భూపాలపల్లిలో వెంకటేశ్వర స్వామి గుడి నిర్మాణంపై మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిపై రాజలింగమూర్తి కేసు వేశారు.
ఇవి కూడా చదవండి...
వైసీపీపై షాకింగ్ కామెంట్స్ చేసిన షర్మిల..
పీఎం కిసాన్ నిధులు పడేది ఆ రోజే..
Read Latest Telangana News And Telugu News